Sameera Bharadwaj : ఈ సింగర్ కాలికి ఏమైంది..? విరిగిన కాలుతో డ్యాన్స్.. శ్రీముఖిని పట్టుకొని నడుస్తూ..

తాజాగా సమీరా, యాంకర్ శ్రీముఖితో కలిసి తను పాడిన ఓ ప్రైవేట్ సాంగ్ కి డ్యాన్స్ చేసిన వీడియో తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Published By: HashtagU Telugu Desk
Sameera Bharadwaj Post a Dance Video and Comments with Broken Leg

Sameera Bharadwaj

Sameera Bharadwaj : సింగర్ సమీరా భరద్వాజ్ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి ప్రేక్షకులని మెప్పించింది. మంచి ఫాస్ట్ బీట్ సాంగ్స్ పాడించాలంటే ఈమె గుర్తుకు వస్తుంది మ్యూజిక్ డైరెక్టర్స్ కి. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా మంచి కామెడీ, మెసేజ్ కంటెంట్ వీడియోలు చేస్తూ మరింత పాపులర్ అయింది సింగర్ సమీరా భరద్వాజ్.

తాజాగా సమీరా, యాంకర్ శ్రీముఖితో కలిసి తను పాడిన ఓ ప్రైవేట్ సాంగ్ కి డ్యాన్స్ చేసిన వీడియో తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో చివర్లో శ్రీముఖిని పట్టుకొని కొంచెం కుంటుతూ నడిచింది సమీరా. అలాగే తన కుడి కాలుకు మాత్రం సాక్స్ వేసుకుంది. ఈ వీడియో షేర్ చేసి సమీరా భరద్వాజ్.. విరిగిన కాలుతోనే డ్యాన్స్ వేసాను అని పోస్ట్ చేసింది. కామెంట్స్ లో ఓ నెటిజన్ ఒక్క కాలుకే సాక్స్ వేసుకున్నారు అని అడగడంతో.. ఆ ఒక్క కాలే విరిగింది కాబట్టి అని రిప్లై ఇచ్చింది.

దీంతో సింగర్ సమీరా భరద్వాజ్ కాలికి ఏమైంది అని ఆమె ఫ్యాన్స్, నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. అయితే ఆమె కాలికి ఏం జరిగింది అని మాత్రం చెప్పకుండా ఇలా ఇండైరెక్ట్ గా విరిగింది అని చెప్తుంది. ఏది ఏమైనా ఆమె త్వరగా కోలుకోవాలని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

 

Also Read : Nikhil Vijayendra Simha : యూట్యూబ్ నుంచి వెండితెరపైకి.. హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న నిహారిక ఫ్రెండ్.. టైటిల్ ఏంటంటే..?

  Last Updated: 18 Sep 2024, 03:59 PM IST