Site icon HashtagU Telugu

Samantha: సమంత షాకింగ్ డెసిషన్.. ఇక సినిమాలకు బ్రేక్!

Samantha

Samantha

టాలీవుడ్ నటి సమంత ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. అభిమానులకు, నిర్మాతలకు స్టార్‌ హీరోయిన్‌ భారీ షాక్ ఇచ్చింది. కొంతకాలం వరకు ఆమె సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం సమంత ‘సీటాడెల్‌’వెబ్‌ సిరీస్‌లో నటిస్తుంది. దీంతో పాటు విజయ్‌ దేవరకొండతో ‘ఖుషి’చిత్రం చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్‌ నడుస్తుంది.

ఈ రెండు సినిమాల షూటింగ్స్‌ పూర్తయిన తర్వాత సమంత లాంగ్‌ బ్రేక్‌ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఏడాది పాటు సినిమాలకు గ్యాప్‌ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. కొత్త సినిమాలకు కోసం తీసుకున్న అడ్వాన్స్‌లను తిరిగి నిర్మాతలకు ఇచ్చేస్తుండటంతో ఇకపై సామ్‌ సినిమాలు చేస్తుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అరుదైన వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో “ఖుషి” సినిమా ఒప్పుకుంది సమంత. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ నడుస్తుంది. ఈ వారంలో సినిమా షూటింగ్ పూర్తవుతుందని విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించాడు. మరోవైపు సమంత చేతిలో “సిటాడెల్” వెబ్ సిరీస్ మాత్రమే ఉంది. దీంతో తర్వాత సామ్ ఏ ప్రాజెక్టుకు ఓకే చెబుతుందోనని తన ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Also Read: Niharika Konidela: అవును మేం ఇద్దరం విడిపోతున్నాం, విడాకులపై నిహారిక రియాక్షన్