Site icon HashtagU Telugu

Samantha: విడాకులపై సమంత షాకింగ్ కామెంట్స్.. చెయ్యని తప్పుకు ఇంట్లో ఎందుకు కూర్చోవాలంటూ?

Samantha Interesting Comments On Remuneration Detailsd

Samantha Interesting Comments On Remuneration Detailsd

Samantha: టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంత కొంతకాలం నుండి వ్యక్తిగతంగా బాగా హాట్ టాపిక్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తన విడాకుల విషయంలో మాత్రం అందరి దృష్టిలో పడింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్యతో విడిపోయి అందర్నీ షాక్ కు గురి చేసింది. విడాకుల తర్వాత తన లైఫ్ ఏంటో తాను కొనసాగిస్తుంది. అయితే గతంలో తన విడాకుల గురించి కొన్ని షాకింగ్ కామెంట్లు చేయగా తాజాగా మరోసారి తన విడాకుల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ప్రస్తుతం ఆమె నటించిన శాకుంతల మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ భాగంలో వరుస ఇంటర్వ్యూలో పాల్గొని చాలా విషయాలు పంచుకుంటుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత విషయాలు కూడా బయట పెట్టింది. విడాకులు తీసుకున్న తర్వాత తనకు పుష్ప లో ఊ అంటావా ఆఫర్ వచ్చిందని.. ఇక తను తప్పు చేయనప్పుడు బాధపడుతూ ఇంట్లోనే ఎందుకు కూర్చోవాలని వెంటనే దానికి ఓకే చేశాను అని తెలిపింది.

ఇక ఆ పాట గురించి ప్రకటించినప్పుడు తన కుటుంబ సభ్యులు, తెలిసినవాళ్లు ఫోన్లు చేసి.. ఇంట్లో కూర్చో చాలు. విడిపోయిన వెంటనే నువ్వు ఐటెం సాంగ్స్ చేయడం బాగోదు అంటూ సలహాలు ఇచ్చారని తెలిపింది. కానీ తాను దానికి అంగీకరించలేదు అంటూ.. ఎందుకంటే తన వైవాహిక బంధం లో తను 100% నిజాయితీగా ఉన్నానని.. కాకపోతే అది వర్కౌట్ కాలేదు అంటూ.. అలాంటప్పుడు నేనేదో నేరం చేసిన దానిలాగా ఎందుకు దాక్కోవాలని.. చెయ్యని నేరానికి నన్ను నేను హింసించుకొని ఎందుకు బాధపడాలి అని తెలిపింది సమంత.

ఇక తను ఇప్పటికే ఎన్నో బాధలు పడ్డాను అంటూ.. నటిగా ప్రతి విషయంలో పర్ఫెక్ట్ గా ఉండాలని.. మరింత అందంగా కనిపించాలని కష్టపడుతూనే ఉన్నాను అని తెలిపింది. ఇక మయోసైటిస్, మెడికేషన్ కారణంగా తనపై తనకే కంట్రోల్ లేకుండా పోయింది అంటూ.. దానివల్ల ఒక్కోసారి తను నీరసంగా కనిపించవచ్చని.. ఒక్కోసారి బొద్దుగా కనిపించవచ్చని.. తను స్టైల్ కోసం కళ్లద్దాలు పెట్టుకుంటున్నానని కొంతమంది అనుకోవచ్చు అంటూ కానీ అది నిజం కాదని తెలిపింది.

ఇక ప్రస్తుతం ఉన్న తన పరిస్థితుల్లో వెలుతురిని తన కళ్ళు తట్టుకోలేవని.. ఇటువంటి ఇబ్బందికర పరిస్థితి ఏ నటికి రాకూడదు అని.. ఎందుకంటే కళ్లతోనే హీరోయిన్లు పలు భావాలు పలికించాలని.. ఇక గడిచిన ఎనిమిది నెలలు ప్రతిరోజు తను పోరాటం చేస్తూనే ఉన్నాను అంటూ.. ఇక ఆ బాధను అనుభవిస్తూనే ఉన్నాను అని.. ఇక అన్నిటిని దాటుకొని ఈ స్థాయికి వచ్చాను కాబట్టి ఇప్పుడు ఎవరైనా తన లుక్స్ గురించి కామెంట్లు చేసిన పట్టించుకోను అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Exit mobile version