Samanthas Remarriage: స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లిపై ఇంతకుముందు రకరకాల టాక్‌లు వినిపించాయి. సమంతకు విడాకులు ఇచ్చాక నాగ చైతన్య ఎంచక్కా రెండో పెళ్లి చేసుకున్నారు. మరోసారి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఇక సమంత వంతు వచ్చింది. ఆమె కూడా మరో పెళ్లి చేసుకొని నూతన దాంపత్య జీవితాన్ని ప్రారంభించాల్సి ఉంది. అయితే సమతకు కాబోయే భర్త ఎవరు ? మల్లె లాంటి ఆమె మంచి మనసును గెలుచుకునే వరుడు ఎవరు ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో తాజాగా ఓ కొత్త ప్రచారం మొదలైంది.
Also Read :YS Sharmila : వైఎస్ భారతికి అండగా వైఎస్ షర్మిల ఎమోషనల్ ట్వీట్
పికిల్ బాల్ మ్యాచ్ వేళ..
బాలీవుడ్ మూవీ డైరెక్టర్ రాజ్ నిడిమోరు(Samanthas Remarriage)తో సమంత డేటింగ్ చేస్తున్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. సిటాడెల్ హన్నీబన్నీ వెబ్ సిరీస్‌కు డైరెక్టర్‌గా పనిచేసి రాజ్ నిడిమోరు అందరి మన్ననలు అందుకున్నారు. తన సత్తా ఏమిటో నిరూపించుకున్నారు. అయితే ఇదే వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్రలో సమంత నటించారు. అప్పటి నుంచే డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఆమెకు సాన్నిహిత్యం పెరిగిందని అంటున్నారు. పికిల్ బాల్ క్రీడ అంటే సమంతకు బాగా ఆసక్తి. అందుకే ఆమె ది చెన్నై సూపర్ ఛాంప్స్ టీమ్‌ను కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న వరల్డ్ పికిల్ బాల్ లీగ్ మ్యాచ్ జరిగింది. ఇందులో సమంతకు చెందిన టీమ్, మరో టీమ్‌తో తలపడింది. ఈ మ్యాచ్ సందర్భంగా రాజ్ నిడిమోరుతో సమంత చెట్టపట్టాలు వేసుకొని తిరిగారు. ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. సినీ ఇండస్ట్రీలోకి వచ్చే 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సమంత ఇటీవలే పార్టీ ఇచ్చారు. ఆ వేడుకల్లో సైతం రాజ్ నిడిమోరు కనిపించారు.
Also Read :Indian Robots : మయన్మార్‌లో భారత రోబోలు.. ఏం చేస్తున్నాయి ?
కెరీర్‌లో సెట్ అయిన సమంత
మరోవైపు త్రాలాలా మూవింగ్ పిక్చ ర్స్ పేరుతో సొంత ప్రొడక్షన్ హౌస్‌ను సమంత స్థాపించారు. తద్వారా మూవీ ప్రొడక్షన్‌పైనా ఆమె ఫోకస్ పెట్టారు. సమంత ఇకపై బాలీవుడ్ సినిమాలకు పరిమితం కావాలని భావిస్తున్నారట. కెరీర్‌లో బాగానే సెట్ అయిన సమంత.. త్వరలోనే రాజ్ నిడిమోరుతో పెళ్లి చేసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఆయన స్వస్థలం ఏపీలోని తిరుపతి. ఒకవేళ వీరిద్దరి మ్యారేజ్ జరిగితే మరోసారి సమంత తెలుగింటి కోడలు అవుతారు.