సమంత రెండో పెళ్లి వార్త సినీ వర్గాల్లో మాత్రమే కాదు, సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చకు దారితీసింది. ఈ పెళ్లి తో నాగచైతన్య పేరు మరోసారి తెరపైకి వచ్చింది. సమంత కొత్త జీవితాన్ని ప్రారంభించిన నేపథ్యంలో “చైతూ బంగారం” అంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 2021లో విడాకులు జరిగిన సమయంలో చైతన్యపై వచ్చిన విమర్శలు, అతనికి సంబంధించి ప్రచారమైన రూమర్లు మళ్లీ గుర్తుకు వస్తున్నాయి. అప్పట్లో నాగచైతన్యకు మరో అఫైర్ ఉందని కొందరు ఆరోపించిన నేపథ్యంలో, ఆయన అభిమానులు ఇప్పుడు ఆ విమర్శలను తిరిగి ప్రశ్నిస్తున్నారు.
Nick Names: చిన్న పిల్లలను ముద్దుపేర్లతో పిలుస్తున్నారా.. అయితే ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
విడాకుల అనంతరం చైతూ–శోభిత గురించి రూమర్లు ప్రచారం అయినప్పటికీ, ఇద్దరూ స్పష్టమైన స్టేట్మెంట్లు ఇచ్చి వాటిని ఖండించారు. విడాకుల తర్వాతే తమ పరిచయం మొదలైందని చెబుతూ, అసత్య ప్రచారాలకు బ్రేక్ పెట్టేందుకు ఇద్దరూ ముందుకు రావాల్సి వచ్చింది. అప్పుడు జరిగిన అనవసర చర్చలు, సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు చైతన్య వ్యక్తిగత జీవితాన్ని బాగా ప్రభావితం చేశాయనే భావన అభిమానుల్లో ఉంది. ఇప్పుడేమో సమంత కొత్త అధ్యాయం ప్రారంభించడంతో, గతంలో చైతన్యపై వేసిన ఆరోపణలు నెటిజన్ల చర్చల్లో మళ్లీ ప్రస్తావనకు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో చైతన్య పాత వీడియో ఒకటి మళ్లీ వైరల్ అవుతోంది. అందులో “ఒక సంబంధాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకునే ముందు నేను వెయ్యిసార్లు ఆలోచిస్తాను” అని చెప్పిన మాటలు ఇప్పుడు కొత్త అర్థం తెచ్చుకున్నాయి. ఆ భావోద్వేగపూరిత స్పందన అతని వ్యక్తిత్వాన్ని చూపుతుందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తపరుస్తున్నారు. సమంత–చైతన్య వ్యక్తిగత జీవితాలు వేరువేరుగా ముందుకు సాగుతున్నా, సోషల్ మీడియా మాత్రం గతాన్ని మళ్లీ తెరపైకి లాగుతూ చర్చలను వేడెక్కిస్తోంది. అభిమానుల పరంగా చూడగా, ఈ ఇద్దరూ ప్రశాంతంగా తమ తమ జీవితాల్లో ముందుకు సాగాలనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
