టాలీవుడ్ నటి సమంత (Samantha) ప్రధాన పాత్రలో శాకుంతలం మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ (Shaakuntalam) బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే టాలీవుడ్ నిర్మాత-దర్శకుడు చిట్టిబాబు రియాక్ట్ అవుతూ సమంత కెరీర్ అయిపోనట్టేనని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దీంతో సమంత కర్మ గురించి భగవద్గీతలోని కోట్‌తో పాటుగా ఒక ఫొటోను (Social Media) షేర్ చేసింది.
సమంతా తన కారులో కూర్చుని ఆలోచనలలో కూరుకుపోయి కనిపించింది. “కర్మణ్యే వాధికా రాస్తే, మా ఫలేషు కదాచన, మా కర్మ ఫల హే తుర్ భూః, మా తే సంగోత్స్వ కర్మణి.” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కష్టపడి పనిచేయడం వరకు మన చేతుల్లో ఉంటుందని, ఫలితం గురించి ఆలోచించవద్దు అనే అర్థంలో సమంత పోస్ట్ (Post) చేసింది. కాగా శకుంతలం మూవీ బాక్సాఫీస్ వద్ద 10 కోట్ల రూపాయలను దాటడానికి కూడా కష్టాలు పడాల్సి వస్తోంది. శకుంతలం నాలుగో రోజున 60 లక్షల రూపాయలను మాత్రమే (Shaakuntalam) వసూలు చేసింది. భారతదేశంలో శాకుంతలం రూ.6.25 కోట్ల నికర వసూళ్లు సాధించింది. అయితే 65 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు సమాచారం.
శాకుంతలం మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోరా పరాజయం (Failure) కావడంతో చిట్టిబాబు రియాక్ట్ అయ్యారు. “స్టార్ హీరోయిన్”గా సమంత కెరీర్ ముగిసిందని, ఇప్పుడు ఆమె తన సినిమాలను ప్రమోట్ చేయడానికి “చౌక వ్యూహాలను” ఉపయోగిస్తోందని పేర్కొన్నారు. “సమంత విడాకుల తర్వాత పుష్ప మూవీలో ఊ అంటావా ఐటెం సాంగ్ చేసింది. కథానాయికగా ఆమె కెరీర్ ముగిసిపోయి మళ్లీ స్టార్‌డమ్ అందుకోలేకపోయింది. ఆమెకు లభించే ఆఫర్లను చేస్తూ ప్రయాణాన్ని కొనసాగించాలి ”అని అన్నారు.