Site icon HashtagU Telugu

Samantha’s Instagram: సమంత ఇన్ స్టాగ్రామ్ హ్యాక్ అయ్యిందా?

Samantha

Samantha

టాలీవుడ్ హీరోయిన్ సమంత నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తుంటుంది. తన సినిమాకు సంబంధించిన ఆప్డేట్స్, ఇతర వ్యక్తిగత ఫొటోలను షేర్ చేస్తుంటుంది. ఏమైందేమో కానీ సమంత అక్కౌంట్ ఒక్కసారిగా పనిచేయడం లేదట. నిన్న సోమవారం ఒక ఫోటో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్రాస్ పోస్ట్ చేయడంతో ఇబ్బంది పడింది. ఈ విషయమై సమంత సోషల్ మీడియా మేనేజర్ వివరణ ఇచ్చాడు. “సాంకేతిక లోపం కారణంగా, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ తప్పుగా సమంత ఖాతాలో క్రాస్ పోస్ట్ అయ్యింది.

మేం ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో ఆరా తీస్తున్నాం. అసౌకర్యానికి చింతిస్తున్నాం” అంటూ ఇన్ స్టానుద్దేశించి సమంత రియాక్ట్ అయ్యింది. సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఖుషి రొమాంటిక్ డ్రామాలో నటిస్తుంది.  ఇందులో విజయ్ దేవరకొండ కూడా నటించారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ ఏడాది డిసెంబర్ 23న థియేటర్లలోకి రానుంది. యశోద ఇతర సినిమాలు కూడా సెట్స్ పై ఉన్నాయి.

Exit mobile version