Site icon HashtagU Telugu

Samantha-Tamannah: తమన్నా ఆమె ప్రియుడితో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన సమంత.. ఫ్రెండ్షిప్ గోల్స్ అంటూ?

Mixcollage 20 Mar 2024 04 21 Pm 7847

Mixcollage 20 Mar 2024 04 21 Pm 7847

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మళ్లీ సినిమాలలో బిజీ బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే సమంత హిందీలో సిటాడెల్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉంటే తాజాగా సమంత తమన్నా, ఆమె ప్రియుడు విజయ్ వర్మ సమంత ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఫ్రెండ్ షిప్ గోల్స్ అంటూ ఆ ఫొటోలను షేర్ చేసింది. మార్చి 19న సమంత తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో తమన్నాతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది.

ఈ ఫోటోను షేర్ చేస్తూ ఒక మై లవ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలో తమన్నాతో పాటు ఆమె ప్రియుడు విజయ్ కూడా ఉన్నారు. ఈ ఇద్దరూ బ్యూటీలు నవ్వులు చిందిస్తుండగా విజయ్ వర్మ హ్యాపీగా ఫొటోగ్రాఫర్ గా మారిపోయాడు. ఒకే ప్రేమ్ లో వీరు ముగ్గరు మెరిసిపోయారు. ఆ తర్వాత విజయ్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో వారిద్దరి కలయికకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసిన ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

తమన్నా సమంత అభిమానులు ఆ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత మళ్లీ యాక్టివ్ మోడ్ లోకి వచ్చారు. త్వరలోనే ఆమె మరిన్ని సినిమా ప్రాజెక్టులను ఒకే చేసే అవకాశం ఉంది. ఇక ఈ బ్యూటీ పుష్ప2 లో కూడా నటిస్తుందనే టాక్ కూడా వినిపిస్తోంది. తమన్నా విషయానికొస్తే తమన్నా ప్రస్తుతం వరుసగా సినిమాలు వెబ్ సిరీస్ లు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.