Site icon HashtagU Telugu

Samantha Latest Pics: హెల్త్ ఇష్యూస్ తర్వాత.. సమంత ఎలా ఉందో తెలుసా!

Samantha

Samantha

స్టార్ హీరోయిన్ సమంత కండరాల వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. మైయోసిటిస్‌తో అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రకటించింది. కొంత కాలంగా ఆమె సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చింది. సామ్ ఆరోగ్య పరిస్థితిపై టాలీవుడ్ హీరో హీరోయిన్లు త్వరగా కోలుకువాలంటూ ధైర్యం కూడా చెప్పారు. ఇక యశోద టీం సైతం సమంత ఆరోగ్యం గురించి హైరానా పడింది. తాజాగా ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకున్న తర్వాత సమంత ఫస్ట్ ఫొటో ఒకటి బయటకొచ్చింది.

“నా మంచి స్నేహితుడు @rajndk రాజ్ చాలా ధైర్యం చెప్పారు. రోజులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం ముందుకు వెళ్లాలి అని చెప్పాడు. ♥️ #yashodathemovie ప్రమోషన్స్ కోసం బయటకొస్తున్నా.  11వ తేదీన కలుద్దాం” అని అంటూ క్యాప్షన్ ఇచ్చింది సమంత. నల్లటి దుస్తులలో, గాగుల్స్‌తో కనిపించింది సమంత. అయితే వైద్య పరిస్థితిని బట్టి సామ్ చాలా బాధకు గురైనట్టు తెలుస్తోంది. నవంబర్ 11న యశోద సినిమా విడుదల కానున్నందున యాంకర్ సుమకు ఇంటర్వ్యూ ఇచ్చింది సమంత. అతి త్వరలో ఆ ఇంటర్వ్యూ ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ప్రస్తుతం సమంత ఫొటో వైరల్ గా మారింది.