Site icon HashtagU Telugu

Samantha Tattoo: చైతూను మరిచిపోలేకపోతున్న సమంత, ఒంటిపై మాజీ భర్త టాటూలు ప్రత్యక్షం!

Sam

Sam

టాలీవుడ్ నటి సమంత (Samantha) ఇటీవల శాకుంతలం మూవీతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపర్చడంతో వెంటనే మరో సినిమాపై ఫోకస్ పెట్టింది సామ్. తన నెక్ట్స్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ తో బిజీగా మారింది. ఇటీవల లండన్ లో ప్రీమియర్ షో కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో సమంత (Samantha) అచ్చం హాలీవుడ్ హీరోయిన్ లా కనిపించి ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది.

అయితే సమంత ఫొటోలు (Pics) ఎంతగా వైరల్ అయ్యాయో, అంతకుమించి ఆమె ఒంటిపైన ఉన్న టాటూస్ (Tattoo) కూడా వైరల్ గా మారాయి. చాలామంది అభిమానుల కళ్లు సమంత ఒంటిపై ఉన్న టాటూస్ పైనే పడ్డాయి. కారణం తన మాజీ భర్త చైతన్య కు సంబంధించిన పచ్చబొట్టు కావడం. నాగ చైతన్యతో విడిపోయినప్పటికీ ఇప్పటికీ చైతూ టాటూస్ ను చెరిపివేయలేదు. సమంత తన పక్కటెముకకు కుడి వైపున ‘ఛే’ టాటూ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియా (Social Media) లో హల్ చల్ చేస్తోంది.

చైతూకు బ్రేకప్ చెప్పినప్పటికీ సమంత (Naga Chiatanya) పచ్చబొట్టును తొలగించకపోవడంతో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. నాగ చైతన్యతో తన తొలి చిత్రం ‘ఏ మాయ చేసావే’ సినిమా సమయంలో వేయించుకున్న టాటూ కూడా ఉంది. కొన్ని నెలల క్రితం సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసినప్పుడు ఓ అభిమాని టాటూ గురించి ప్రస్తావించాడు. వెంటనే సమంత ఒంటిపై టాటూలు వేయించుకోవద్దని, అందుకు చాలా కారణాలు ఉంటాయని చెప్పింది. జీవితంలో టాటూలు వేయించుకోవద్దంటూ బదులిచ్చింది.

Also Read: MS Dhoni: ఇదే నా చివరి ఐపీఎల్: ధోని సంచలన వ్యాఖ్యలు!