Site icon HashtagU Telugu

Samantha – Sai Pallavi : సాయి పల్లవి డాన్స్ షోకి సమంత గెస్టుగా వెళ్లిన వీడియో చూశారా..!

Samantha went to Sai Pallavi Dance Show when Sai Pallavi is a Contestant

Samantha went to Sai Pallavi Dance Show when Sai Pallavi is a Contestant

సమంత(Samantha), సాయి పల్లవి(Sai Pallavi).. సౌత్ ఇండస్ట్రీలో హీరోలతో సమానంగా స్టార్‌డమ్ ని అందుకున్న హీరోయిన్స్. ప్రస్తుతం ఒకరు లేడీ సూపర్ స్టార్ అనే పిలుపు సంపాదించుకుంటే, మరొకరు లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ ని సొంతం చేసుకున్నారు. అలాంటి వీరిద్దరికి సంబంధించిన ఓ వింటేజ్ వీడియోని మీరు చూశారా. అయితే ఆ సమయంలో సమంత హీరోయిన్ గా కొనసాగుతుంటే, సాయి పల్లవి డాన్స్ షోలో కంటెస్టెంట్ గా చేస్తున్నారు.

సాయి పల్లవి డాన్సర్ అన్న విషయం అందరికి తెలిసిందే. తెలుగు పాపులర్ డాన్స్ షో ‘ఢీ’లో కంటెస్టెంట్ గా పోటీ చేసి ఫైనల్ 5లో నిలిచారు. కాగా సాయి పల్లవి ఆ షోలో కంటెస్టెంట్ గా చేస్తున్న సమయంలోనే సమంత.. ఆ షోకి గెస్టుగా వెళ్లారు. అతిథిగా వెళ్లడమే కాదు సాయి పల్లవి వేసిన డాన్స్ ని జడ్జి చేస్తూ తన కామెంట్స్ ని కూడా తెలియజేసారు. సాయి పల్లవి తన డాన్స్ లోని గ్రేస్ తో సమంతని మెస్మరైజ్ చేసారు. ఆ వీడియోని మీరు కూడా చూసేయండి..

ఇక సమంత 2010లో తన సినిమా కెరీర్ ని స్టార్ట్ చేసారు. నాగచైతన్యతో కలిసి ‘ఏమాయ చేసావే’ సినిమాలో జెస్సిగా నటించి అందరి మనసులు దోచుకున్నారు. ఆ తరువాత ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్ ల్లో కూడా నటించి పాన్ ఇండియా ఇమేజ్ ని సొంత చేసుకున్నారు. ప్రస్తుతం అనారోగ్య సమస్యతో సినిమాలకు కొంచెం బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు.

ఇక సాయి పల్లవి విషయానికి వస్తే.. 2015లో తెరకెక్కిన మలయాళ మూవీ ‘ప్రేమమ్’లో మలర్ గా నటించి అబ్బాయిల మనసు దోచుకున్నారు. ఆ తరువాత తెలుగులో ‘ఫిదా’లో హైబ్రిడ్ పిల్ల భానుమతిగా అందర్నీ ఫిదా చేసారు. సెలెక్టివ్ గా సినిమాలు ఎంపిక చేసుకునే సాయి పల్లవి.. 9ఏళ్ళ కెరీర్ లో కేవలం 15 సినిమాలు మాత్రమే చేసారు. కానీ ఆమె అందుకున్న స్టార్‌డమ్ మాత్రం ఎవరూ ఊహించలేనంత.

 

Also Read : NTR : ఎన్టీఆర్ మీ ఇంటికి వస్తే.. ఇలా వంట చేసి భోజనం పెట్టండి..