Site icon HashtagU Telugu

Samantha : భూటాన్ లో సమంత ఆయుర్వేదం చికిత్స.. ఆరోగ్యం, ప్రశాంతత కోసం..

Samantha went to Bhutan for Ayurveda Treatment

Samantha went to Bhutan for Ayurveda Treatment

సమంత(Samantha) కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఇటీవల తన మయోసైటిస్(Myositis) ని తగ్గించుకోవడానికి, ఆరోగ్యం మీద మరింత ఫోకస్ చేయడానికి రకరకాల వైద్యాలు ట్రై చేస్తుంది. ఈ నేపథ్యంలో పలు దేశాలు తిరుగుతుంది సమంత. ఇప్పటికే ఇండియాలోని పలు ప్రదేశాలతో పాటు, బాలి, అమెరికా, ఆస్ట్రియా, ఇటలీ.. లాంటి పలు దేశాలు తిరిగి అక్కడ కూడా రకరకాల కొత్త వైద్యాలు ట్రై చేసింది.

ఇటీవలే సమంత క్రయోథెరపి అనే వైద్యం చేయించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సమంత భూటాన్(Bhutan) వెళ్ళింది. భూటాన్ లో ఆయుర్వేద చికిత్సలు తీసుకుంటూ అలాగే మానసిక ప్రశాంతత కోసం కూడా భూటాన్ లో ఆహ్లాదకరమైన ప్రదేశాలు తిరిగేస్తుంది సమంత.

భూటాన్ లో హాట్ స్టోన్ బాత్ అనే ఓ ఆయుర్వేద చికిత్సని ట్రై చేసింది సమంత. దాని గురించి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పలు విషయాలు షేర్ చేసింది. హాట్ వాటర్ లో అక్కడ ఉన్న రాళ్లు, కెంపా అనే మూలికా ఆకులు వేయగా వాటి శక్తి ఆ నీళ్ళల్లో కరిగి వాటితో స్నానం చేయడం వల్ల మనకు ఉన్న బాడీ పెయిన్స్, అలసట, కడుపు నొప్పి, జాయింట్ పెయిన్స్, ఎముకల బలహీనత.. లాంటి పలు సమస్యలు తగ్గుతాయని తెలిపింది.

సమంత భూటాన్ లో ఈ హాట్ స్టోన్ బాత్ ని ట్రై చేసింది. అలాగే అక్కడ ఉన్న కుటీర పరిశ్రమలు, కొండలు, కోనలు, ప్రకృతి ప్రదేశాలు, బౌద్ధ ఆలయాలు సందర్శిస్తుంది. ఓ బౌద్ధ ఆలయంలో ధ్యానం చేస్తున్న ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది సమంత.

 

Also Read : Rashmika Mandanna : రష్మిక వర్కౌట్స్ చూశారా? ఎంత కష్టపడుతుందో..