Site icon HashtagU Telugu

Samantha : తల్లితో కలిసి అమెరికా వెళ్లిన సమంత.. ట్రీట్మెంట్ కోసమేనా?

Samantha went to America with Her Mom for Myositis Treatment

Samantha went to America with Her Mom for Myositis Treatment

సమంత(Samantha) కొన్నాళ్ళు సినిమాల(Movies)కు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మయోసైటిస్(Myositis) నుంచి పూర్తిగా కోలుకోవడానికి సమంత సినిమాలకు బ్రేక్ ఇస్తుందని, అమెరికాకు(America) వెళ్లి త్వరలో చికిత్స తీసుకుంటుందని సామ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇటీవలే ఖుషి(Kushi) సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ లో కనపడి అలరించింది సామ్.

గత కొన్ని రోజులుగా ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలకు ట్రిప్స్ వేస్తున్న సమంత ఇప్పుడు అమెరికాకు పయనమైంది. తాజాగా నేడు సాయంత్రం తన తల్లితో కలిసి అమెరికాకు వెళ్ళింది. ఎయిర్ పోర్ట్‌లో తల్లితో కలిసి సమంత అమెరికాకు వెళ్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కూడా మీ అందర్నీ మిస్ అవుతున్నాను, కొత్తగా మొదలుపెడుతున్నాను అని పోస్ట్ చేసింది.

 

దీంతో సమంత అమెరికాకు ట్రీట్మెంట్ కోసమే వెళ్తుందని అంతా భావిస్తున్నారు. అయితే సమంత న్యూయార్క్ లో జరిగే ఇండిపెండెన్స్ పరేడ్ లో కూడా పాల్గొనబోతుంది. దానికోసమే అమెరికాకు వెళ్తుందని కొంతమంది అంటున్నారు. అయితే సమంత పెట్టిన స్టోరీలను బట్టి చూస్తే సమంత ట్రీట్మెంట్ కోసం కూడా వెళ్లినట్టు తెలుస్తుంది. అలాగే తల్లిని కూడా తీసుకువెళ్తుండటంతో కచ్చితంగా ట్రీట్మెంట్ కోసమే అంటున్నారు. న్యూయార్క్ లోని పరేడ్ లో పాల్గొని అనంతరం ట్రీట్మెంట్ కి వెళ్తుందని అంటున్నారు. చూడాలి మరి సమంత తన సోషల్ మీడియా ద్వారా ఇంకా ఏమేం విషయాలు చెప్తుందో. సమంత త్వరగా కోలుకొని రావాలని ఆమె అభిమానులు, ఆడియన్స్ కోరుకుంటున్నారు.

 

 

Also Read : Brahmanandam Son Marriage : బ్రహ్మానందం రెండో తనయుడి వివాహం.. బ్రహ్మానందం కోడలు ఎవరు? ఏం చేస్తుందో తెలుసా?