Samantha : సౌత్ లో స్టార్ గా ఎదిగిన సమంత ఓ సంవత్సరం నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది. మయోసైటిస్ తో పాటు పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఓ పక్క చికిత్స తీసుకుంటూనే మరో పక్క తన బిజినెస్ లు చూసుకుంటుంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమంత మళ్ళీ సినిమాలు, సిరీస్ లతో బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తుంది.
సమంత వరుణ్ ధావన్ కలిసి నటించిన సిటాడెల్ సిరీస్ ఇటీవల అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజయింది. సిటాడెల్ ప్రమోషన్స్ లో సమంత చాలా యాక్టివ్ గా పాల్గొంది. ఈ సిరీస్ తో బాలీవుడ్, హాలీవుడ్ సిరీస్ లు, సినిమాలలో ఛాన్సులు పట్టేయాలని చూస్తుంది సమంత. అయితే సిటాడెల్ సిరీస్ లో సమంత ఓ పాపకు తల్లిగా కూడా నటించింది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తల్లిగా నటించారు, ఆ అనుభూతి ఎలా ఉంది, నిజ జీవితంలో తల్లి అవుతారా అని ప్రశ్న ఎదురైంది.
దీనికి సమాధానమిస్తూ.. సినిమాలో నా కూతురుగా నటించిన పాపతో నాకు మంచి బంధం ఏర్పడింది. నా నిజమైన కూతురు లానే భావించాను. నేను తల్లి అవ్వాలని ఇప్పటికి కలలు కంటాను. తల్లిగా ఉండటం నేను ఇష్టపడతాను. ఇప్పుడు నాకేమి ఆలస్యం అవ్వలేదు. తల్లి అవ్వడానికి వయసుతో సంబంధం లేదు. తల్లిగా వచ్చే అనుభూతిని నేను పొందాలనుకుంటున్నాను అని తెలిపింది సమంత. దీంతో నాగచైతన్య లాగే సమంత కూడా త్వరలోనే ఎవర్నైనా పెళ్లి చేసుకొని తల్లి అవుతుందా అని అనుకుంటున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు.
Also Read : Krish got married to Priti Challa : రెండో పెళ్లి చేసుకున్న స్టార్ డైరెక్టర్