Site icon HashtagU Telugu

Samantha: అమ్మవారి సేవలో హీరోయిన్ సమంత.. సెల్ఫీల కోసం ఎగబడిన అభిమానులు?

Mixcollage 05 Mar 2024 08 51 Am 8711

Mixcollage 05 Mar 2024 08 51 Am 8711

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మళ్ళీ సినిమాలలో బిజీ బిజీ అవ్వడానికి తెగ ప్రయత్నిస్తోంది. సమంత రీ ఎంట్రీ కోసం కూడా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మయోసైటీస్ వ్యాధి కారణంగా ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇస్తున్నట్లు తెలిపిన సమంత, చెప్పినట్టుగానే ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న సమంత మళ్ళీ సినిమాలలో బిజీ బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది.. ఇది ఇలా ఉంటే తాజాగా సమంత తిరుచానూరులో కనిపించారు. తిరుచానూరులో ఉన్న పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించింది.

ఆలయ సందర్శనకు సంబంధించిన వీడియోను ఆమె బృందం ఎక్స్ లో షేర్ చేసింది. ఈ ఉదయం తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు అని ఆమె పిఆర్ ఎక్స్ లో ఒక వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో సమంత షేడ్ కుర్తా-పైజామా సెట్ ధరించి చిరునవ్వులు చిందిస్తోంది. సింపుల్ గోల్డ్ చెవిపోగులు, నుదుటిపై బొట్టు పెట్టుకుని ఫిదా చేసింది. ఆలయంలో ఆమెను చూసిన అభిమానులు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. సమంత కూడా అడిగిన వెంటనే ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆమెతో పాటు ఆమె స్టైలిస్ట్, స్నేహితుడు ప్రీతమ్ జుకల్కర్ కూడా ఉన్నారు.

 

ప్రస్తుతం సమంత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సమంతను చూసిన అభిమానులు ఎగ్జైటింగ్ తో ఆమెతో సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు. ఇకపోతే సమంత సినిమాల విషయానికొస్తే ఆమె చివరిగా విజయ్ దేవరకొండ సరసన నటించిన ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం సమంత కు రెండు మూడు సినిమా అవకాశాలు రాగా అవి చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది.