Samantha : సమంత..బాడీ పెయిన్స్ ఉన్నాయి..వద్దు అని చెప్పిన వినలేదట

ఆరోగ్యం బాగాలేదని , నీరసంగా ఉందని చెప్పిన అస్సలు వినడట. ఖచ్చితంగా జిమ్ కు హాజరు కావాల్సిందే అని ఆర్డర్ ఇస్తుంటాడట

  • Written By:
  • Publish Date - October 16, 2023 / 02:24 PM IST

చిత్రసీమ (Tollywood)లో రాణించాలంటే మంచి ఫిజిక్ ఉండాల్సిందే..హీరోలైన్ , హీరోయిన్స్ (Hero & Heroins) ఐన తమ బాడీ విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటుండాలి. నిత్యం జిమ్ లో కసరత్తులు చేస్తూ తమ బాడీని అదుపులో ఉంచుకోవాలి. ముఖ్యంగా హీరోయిన్ ఈ విషయంలో చాల కష్టపడుతుంటారు. సరైన డైట్ తీసుకుంటూ ఎప్పుడు స్లిమ్ గా ఉండేలా చూసుకుంటారు. ఇందుకు గాను ప్రత్యేకంగా జిమ్ (GYM) ట్రైనర్ ను పెట్టుకొని అతడి ఆదేశాలను పాటిస్తుంటారు.

We’re now on WhatsApp. Click to Join.

సమంత (Samantha) కూడా గత కొన్నేళ్లుగా ఇలాగే కష్టపడుతుంది. అయితే సమంత ట్రైనర్ (Samantha Trainer ) చాల స్ట్రిక్ట్..ఆరోగ్యం బాగాలేదని , నీరసంగా ఉందని చెప్పిన అస్సలు వినడట. ఖచ్చితంగా జిమ్ కు హాజరు కావాల్సిందే అని ఆర్డర్ ఇస్తుంటాడట. తాజాగా ఇదే విషయాన్నీ సమంత షేర్ చేసింది. అర్దరాత్రి మెసేజ్ పెట్టి మరీ సమంతకు గుర్తు చేశాడట. కానీ సండే కదా వద్దు అన్నా కూడా వినలేదట ట్రైనర్. బాడీ పెయిన్స్ ఉన్నాయని చెప్పినా ఊరుకోలేదట.. పొద్దున్నే జిమ్ కి వచ్చి రెడీగా ఉన్నాడట. సండే అయినా కూడా వదలలేదట. అందుకే ఇదొక బ్యాడ్ డే అని ఫన్నీగా తన ఇన్ స్టా స్టోరీ పెట్టింది సామ్. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ లను కూడా పంచుకుంది.

ప్రస్తుతం సామ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన ఆరోగ్యం ఫై దృష్టి పెట్టింది. రీసెంట్ గా ఖుషి మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.విజయ్ దేవరకొండ హీరో గా నటించిన మజిలీ ఫేమ్ శివ నిర్వాణ డైరెక్ట్ చేసాడు.

Read Also : Special Trains: దసరా సందర్భంగా 620 ప్రత్యేక రైళ్లు