Site icon HashtagU Telugu

Samantha Unfollows : చైతూను ‘అన్ ఫాలో’ చేసిన సామ్!

టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ గా పేరొందిన సమంత-నాగ చైతన్యలు విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ జంట విడాకులు తీసుకున్న విషయం ఇప్పటికీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతోంది. సమంత, అక్కినేని నాగచైతన్యల మధ్య ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. అయితే వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం సమంత సోషల్ మీడియాలో చైతన్యను ఫాలో అవ్వడం మానేసింది. ఇప్పటికే తన ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి నాగ చైతన్య ఫోటోలను డిలీట్‌ చేసిన సామ్‌ రీసెంట్‌గా అతన్ని అన్‌ఫాలో కూడా చేసేసింది. అంతేకాదు.. నాగచైతన్య ఫ్యామిలీ సంబంధించిన వ్యక్తులనుకూడా అన్ ఫాలో చేసిందట. విడిపోయిన తర్వాత తాము స్నేహితులుగా ఉంటామని చెప్పిన ఈ ఇద్దరు.. అన్ ఫాలో కావడంతో స్నేహంగా ఉండటానికి కూడా ఇష్టపడటం లేదని తాజా సంఘటనతో తెలిసిపోయింది.

Exit mobile version