Site icon HashtagU Telugu

Samantha Shines: పాన్ ఇండియా హీరోయిన్ గా సమంత…ఎన్టీఆర్ ఏ స్థానంలో ఉన్నాడంటే..?

samantha tops

samantha tops

టాలీవుడ్ బ్యూటీ సమంత …నాగచైతన్యతో విడాకులు తర్వాత పూర్తిగా బాలీవుడ్ వైపే తన ద్రుష్టిని కేంద్రీకరించింది. పలు ఆఫర్లతో ఈ అమ్మడు జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. ఉత్తరాదిన ఆమెకు ఫాలోయింగ్ మాస్ రేంజ్ లో పెరుగుతోంది. అంతేకాదు సామ్ క్రేజ్ ఇండియాను దాటిపోతోంది. ఇండియన్ ఫిమేల్ స్టార్స్ లో సమంత అగ్రస్థానంలో నిలిచింది. ORAMAXమీడియా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

ఇండియన్ మోస్ట్ పాపులర్ హీరోయిన్స్ లిస్టులో సమంత మొదటిస్థానంలో నిలిచింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ రెండో స్థానంలో…తర్వాతి స్థానాల్లో నయనతార, కాజల్ అగర్వాల్, దీపికా పదుకునే, రష్మిక మందన్న, అనుష్క శర్మ, కత్రినా కైఫ్, కీర్తి సురేశ్ ఉన్నారని ORMAX వెల్లడించింది.

కాగా హీరోల విషయానికొస్తే తమిళ స్టార్ హీరో విజయ్ తొలిస్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్థానాల్లో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ నిలిచారు. మొత్తానికి పాన్ ఇండియా స్థాయిలో ఉత్తరాది స్టార్ల కంటేనూ దక్షిణాది స్టార్లే ఉండటం గమనార్హం.

Exit mobile version