Samantha : సమంత ఏ మాయ చేసావే సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిందని తెలిసిందే. ఆ సినిమాలో నాగ చైతన్య హీరో కాగా అప్పట్నుంచే వీరి స్నేహం మొదలైంది. అనంతరం కొన్నేళ్లు ప్రేమించుకొని పెళ్లి చేసుకొని పలు కారణాలతో విడిపోయారు. వీరిద్దరూ విడిపోయి ఏళ్ళు గడుస్తున్నా ఇంకా సమంత – నాగ చైతన్య వార్తల్లోనే ఉంటారు.
సమంత సినీ పరిశ్రమకు వచ్చి 15 ఏళ్ళు అవుతుంది. ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి, తన మొదటి సినిమా గురించి మాట్లాడింది.
సమంత మాట్లాడుతూ.. ఇండస్ట్రీలోకి వచ్చి 15 ఏళ్ళు అయిపోయింది. ఇది చాలా ఎక్కువ టైం. కెరీర్ మొదట్లో నేను చేసిన సినిమాల్లో నా యాక్టింగ్ చూసి ఇంత చెత్తగా నటించినా అనుకుంట. మొదట్లో నాకు ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళెవరూ లేరు, భాష కూడా రాదు. అన్ని కొత్తే. కెరీర్ మొదట్లో గ్లామర్ రోల్స్ చేయడానికి ఇబ్బంది పడ్డాను. కానీ తర్వాత ఆ పాత్రల్లో కూడా బాగా నటించాను. నా మొదటి సినిమా మాస్కో కావేరి రాహుల్ రవీంద్రన్ తో కలిసి చేశాను. కానీ అది షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. దాంతో ఏ మాయ చేసావే సినిమా మొదట రిలీజయింది. ఏ మాయ చేసావే సినిమాకు సంబంధించి ప్రతి సీన్, ప్రతి షాట్ నాకు గుర్తుంది. కార్తీక్ ని గేట్ దగ్గర కలిసే షాట్ నా మొదటి షాట్. గౌతమ్ మీనన్ గారు ఆ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఈ 15 ఏళ్లలో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూసాను అని తెలిపింది.
చైతుతో విడాకులు తీసుకున్నా ఏ మాయ చేసావే సినిమా తనకు మొదట రిలీజ్ అయిన సినిమా కావడంతో తనకు అది స్పెషల్ ఫిలిం గా నిలిచిందని సమంత ఫ్యాన్స్ అంటున్నారు. మొత్తానికి చాలా రోజుల తర్వాత సమంత ఏ మాయ చేసావే సినిమా గురించి మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Also Read : Mayuri Kango : ఒకప్పుడు నటిగా ఫెయిల్… ఇప్పుడు గూగుల్ ఇండియా మేనేజర్