Site icon HashtagU Telugu

Samantha Spiritual: సినిమాలకు గుడ్ బై.. ఆధ్యాత్మిక యాత్రలకు సై!

Sam

Sam

టాలీవుడ్ నటి సమంత ఇటీవల సినిమాలకు విరామం ఇవ్వనున్నట్టు తెలిపిన విషయం తెలిసిందే. అయితే వృత్తిపరమైన జీవితానికి దూరంగా ఉన్న సమంత తమిళనాడుకు రోడ్ ట్రిప్‌కు బయలుదేరింది. మణిరత్నం అలై పాయుతే నుండి తమిళ పాటలను ఆస్వాదిస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సామ్ మొదట వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్‌ని సందర్శించారు. ఆ తర్వాత ఆమె నేరుగా కోయంబత్తూర్‌లోని యోగా ఆశ్రమానికి వెళ్లింది. ఆరెంజ్ కాటన్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ కుర్తాలో నటి తన నుదుటిపై తిలకంతో కనిపించింది.

టాలీవుడ్ నటి ఇటీవల తన ఆరోగ్యం కోసం సినిమాల నుంచి ఏడాది పాటు దూరంగా ఉండాలనుకున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ‘ఖషి’ సినిమాలో నటిస్తుంది. దీంతో పాటు సిటాడెల్ వెబ్ సిరీస్ లో కనిపించనునంది.  ఇక వైవిధ్యమైన నటి సాయిపల్లవి సైతం సినిమాలకు దూరంగా ఉంటూ ఆధ్యాత్మిక చింతనలో తరిస్తోంది. ఇటీవలనే ఆమె అమర్ నాథ్ యాత్రలో తల్లిదండ్రుల కలిసి పాల్గొంది. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి.

Also Read: Anasuya Pics: తొడలు చూపిస్తూ, రెచ్చగొడుతూ.. అనసూయ లేటెస్ట్ ఫోటోలు అదుర్స్