Site icon HashtagU Telugu

#ELLE Cover : అభిమానులను మెస్మరైజ్ చేస్తున్న సామ్..!

Sam

Sam

నాగచైతన్య తో విడిపోయిన తర్వాత సమంత అటు నటనాపరంగా.. ఇటు కెరీర్ పరంగా దూసుకుపోతోంది. ఇప్పటి వరస సినిమాలకు సైన్ చేసిన సమంత జట్ స్పీడ్ తో వాటిని పూర్తిచేసే పనిలో పడింది. ఇప్పటికే పుష్ప ఐటం సాంగ్ కోసం సెట్స్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత తాను ప్రకటించిన సినిమాలను పూర్తిచేయబోతోంది. అయితే హాలీవుడ్ లో చాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ.. తాజాగా ఓ మ్యాగజైన్ కవర్ ఫొటో కోసం ఫోజులిచ్చింది.

Sam1

ఎల్లే మ్యాగజైన్ కవర్‌ కోసం ఎరుపు రంగు దుస్తులు ధరించి ఫోజులిచ్చింది. సామ్ తన కౌల్ డ్రెస్‌ను అరోకా రెడ్ హీల్స్‌తో స్టైల్ గా ఉంది. సొగసైన కేశాలంకరణ, మినిమల్ మేకప్, సహజమైన పెదవులు, డ్రస్సుకు సరిపోయే చెవిపోగులు ధరించి హోయలుపోతోంది. ప్రస్తుతం సమంత ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Sam2

ELLEDigitalCoverStar పేరిట ఆ సంస్థ కూడా స‌మంత‌కు చెందిన ఫొటోల‌ను పోస్ట్ చేసింది. ‘ద‌క్షిణాదిలో 11 ఏళ్ల సినీ కెరీర్ త‌ర్వాత స‌మంత ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ లో ఎలా మొద‌లు పెట్టిందో తెలుసుకోండి’ అంటూ పేర్కొంది.

Sam4