Samantha : సెకండ్ మ్యారేజ్ పై సమంత రియాక్షన్ ఏంటో తెలుసా..?

అక్కినేని ఇంటి కోడలైన సమంత (Samantha) రెండేళ్లకే డైవర్స్ తీసుకుంది. నాగ చైతన్య, సమంత చూడముచ్చటైన ఈ జంట విడాకులకు రీజన్స్

  • Written By:
  • Publish Date - December 18, 2023 / 09:47 AM IST

అక్కినేని ఇంటి కోడలైన సమంత (Samantha) రెండేళ్లకే డైవర్స్ తీసుకుంది. నాగ చైతన్య, సమంత చూడముచ్చటైన ఈ జంట విడాకులకు రీజన్స్ ఏంటన్నది ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. అయితే డైవర్స్ తో బాధలో ఉన్న సమంతకు మయోసైటిస్ వ్యాధి మరింత కృంగిపోయేలా చేసింది. వాటిననంటి నుంచి కోలుకుని సమంత ఇప్పుడిప్పుడే మామూలు మనిషి అవుతుంది. అయితే తను ఏం చేసినా సపోర్ట్ చేస్తూ వస్తున్న ఫ్యాన్స్ కి సమంత స్పెషల్ ప్లేస్ ఇస్తుంది.

లేటెస్ట్ గా తన ఇన్ స్టా ఫాలోవర్స్ తో చాట్ చేసిన సమంత తన సెకండ్ మ్యారేజ్ పై స్టాటికల్ గా ఆన్సర్ ఇచ్చింది. ఓ అభిమాని మీరు రెండో పెళ్లి చేసుకుంటారా అని అడిగితే దానికి సమంత రెండో మ్యారేజ్ చేసుకున్న వారిలో డైవర్స్ తీసుకున్న శాతం 67 శాతం ఉందని అదే ఫస్ట్ టైం మ్యారేజ్ చేసుకున్న వారిలో డైవర్స్ తీసుకున్న శాతం 50% అని ఏదో లజిక్ లు మాట్లాడేస్తుంది.

Also Read : Bigg Boss 7 : పల్లవి ప్రశాంత్ గెలుపు బాటలు వేసింది అమరే.. ఎలాగో తెలుసా..?

అంటే సమంత సెకండ్ మ్యారేజ్ అంటూ వచ్చిన వార్తలన్నీ రూమర్సే అన్నమాట. సమంత తను ఫిట్ గా మారి సినిమాలు చేయాలనే అనుకుంటుంది. ఆల్రెడీ ఒకసారి ప్రేమలో పడిన సమంత మళ్లీ ప్రేమ పెళ్లి జోలికి వెళ్లే అవకాశం లేదని చెప్పొచ్చు. మరి సమంత సెకండ్ మ్యారేజ్ పై తన నిర్ణయం ఇలానే ఉంచుకుంటుందా కొన్నాళ్లకు తోడు కావాలని అనుకుంటుందా అన్నది చూడాలి.

ఇక అమ్మడి సినిమాల విషయానికి వస్తే విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేసిన సమంత ఆ తర్వాత మరో తెలుగు సినిమాకు సైన్ చేయలేదు. తను చేయాల్సిన గర్ల్ ఫ్రెండ్ సినిమా రష్మిక చెంత చేరింది. మరి సమంత తెలుగు సినిమాలు చేస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

We’re now on WhatsApp : Click to Join