Samantha : సమంత నటిగా సినిమాలకు గ్యాప్ ఇచ్చినా నిర్మాతగా సినిమాలు మొదలుపెట్టింది. ట్రాలాలా అనే నిర్మాణ సంస్థను స్థాపించి మొదటి సినిమాగా శుభం అంటూ రాబోతుంది. శుభం సినిమా మే 9 న రిలీజ్ కానుంది. ఆల్మోస్ట్ కొత్తవాళ్లు, చిన్న ఆర్టిస్టులను పెట్టి హారర్ కామెడీగా ఈ సినిమాని తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో నిర్వహించారు.
దీంతో చాన్నాళ్లకు సమంత ఓ సినిమా ఈవెంట్లో కనిపించి మాట్లాడింది. చివరగా ఖుషి సినిమాకు పబ్లిక్ ఈవెంట్స్ లో కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే. దీంతో సమంతని చూడటానికి ఫ్యాన్స్ భారీగానే వచ్చారు.
శుభం ప్రీ రిలీజ్ ఈవెంట్లో సమంత మాట్లాడుతూ.. నేను నటించిన మజిలీ, ఓ బేబీ, రంగస్థలం వేడుకలు ఇక్కడ వైజాగ్ లోనే జరిగాయి. వైజాగ్ కి వస్తే సినిమా బ్లాక్ బస్టర్ అనిపిస్తుంది. శుభం సినిమాతో మళ్ళీ బ్లాక్ బస్టర్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఏ మాయ చేసావే సినిమా తర్వాత ప్రేక్షకులకు నేను నచ్చానా లేదా అనుకునేదాన్ని. ఆ సినిమా అయ్యాక నేను వైజాగ్ లో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వస్తే నన్ను గ్రాండ్ గా రిసీవ్ చేసుకున్నారు. భారీగా అభిమానులు వచ్చారు. అప్పుడు మీ ప్రేమ అర్థమైంది. నాకు సినిమా అంటే ప్రాణం. అందుకే నిర్మాతగా కొత్తవాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే ఈ నిర్మాణ సంస్థ పెట్టి సినిమా చేస్తున్నాను. శుభం సినిమా చూసి నవ్వుకుంటూ బయటకు వస్తారు అని చెప్పింది.
సమంత చాన్నాళ్లకు ఓ సినిమా ఈవెంట్లో కనపడటంతో ఆమె ఫోటోలు, వీడియోలు, స్పీచ్ వైరల్ గా మారాయి.
Also Read : Vijay : దిగజారిన తమిళ రాజకీయం.. స్టార్ హీరోకు తెలుగు డైరెక్టర్ తో సినిమా తీయొద్దని చెప్పారట..