Samantha : సినిమా కోసం సమంత ఏం చేయబోతుంది..?

సిటాడెల్ (Citadel) సీరీస్ షూటింగ్ పూర్తి కాగా త్వరలో రిలీజ్ కాబోతుంది. ఐతే సమంత నిర్మాణంలో వస్తున్న బంగారం సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. సినిమా లో సమంత డిఫరెంట్ గా

  • Written By:
  • Publish Date - July 18, 2024 / 02:30 PM IST

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) మళ్లీ కెరీర్ మీద ఫోకస్ చేయాలని అనుకుంటుంది. మొన్నటిదాకా మయోసైటిస్ వల్ల సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన సామ్ ఇక మీదట సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యింది. అంతేకాదు వాటి కోసం తను మళ్లీ ఫిట్ గా మారేందుకు ప్రయత్నిస్తుంది. సమంత ప్రస్తుతం సిటాడెల్ సీరీస్ లో నటిస్తుంది. దానితో పాటుగా తనే నిర్మాతగా మారి బంగారం (Bangaram) సినిమా చేస్తుంది.

సిటాడెల్ (Citadel) సీరీస్ షూటింగ్ పూర్తి కాగా త్వరలో రిలీజ్ కాబోతుంది. ఐతే సమంత నిర్మాణంలో వస్తున్న బంగారం సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. సినిమా లో సమంత డిఫరెంట్ గా కనిపిస్తుందని తెలుస్తుంది. అంతేకాదు సినిమా కోసం సమంత ట్రైనింగ్ తీసుకుంటుందని టాక్. అదే ట్రైనింగ్ అన్నది తెలియదు కానీ బంగారం సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం సమంత ట్రైనిగ్ తీసుకుంటుందని అంటున్నారు.

ఇదిలాఉంటే సమంత కమర్షియల్ సినిమాలకు కూడా ఓకే చెప్పేందుకు సిద్ధమైందట. సమంత కేవలం ఫిమేల్ సెంట్రిక్ (Female Centric) సినిమాలే చేస్తుందని ఈమధ్య వార్తలు రాగా సమంత అన్ని సినిమాలు చేసేందుకు సిద్ధమని అంటుందట. తన ప్రొడక్షన్ లో ఉన్న బంగారం సినిమాను ఈ నెల చివరన కానీ నెక్స్ట్ మంత్ మొదట్లో కానీ సెట్స్ మీదకు తీసుకెళ్తారట.

సమంత బంగారం సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుంది. ఈ సినిమాను తన మార్కెట్ కు తగిన బడ్జెట్ లో పూర్తి చేసి ఆడియన్స్ ని అలరించాలని చూస్తుంది. సమంత తిరిగి ఫాం లోకి రావాలని ఫ్యాన్స్ కోరుతుండగా సమంత కూడా అలాంటి కథల కోసమే ఎదురుచూస్తుందని తెలుస్తుంది.  సమంత నెక్స్ట్ మూవీ హిట్ పడితే మాత్రం మళ్లీ అమ్మడికి వరుస ఛాన్సులు వచ్చేస్తాయని చెప్పొచ్చు. బంగారం సినిమాతో సమంత ఒకప్పటి తన ఎనర్జీని చూపించాలని ఫిక్స్ అయ్యింది.

Follow us