Samantha: జిమ్ లో చెమటలు చిందిస్తున్న సమంత, ఫొటోలు వైరల్

సమంత కు ఏమాత్రం సమయం దొరికినా జిమ్ లో వర్కవుట్స్ చేస్తూ బాడీని బిల్డప్ చేస్తోంది.

  • Written By:
  • Updated On - June 2, 2023 / 05:59 PM IST

టాలీవుడ్ నటి సమంత కు ఇటీవల ‘శాకుంతలం’ సినిమా రూపంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సమంతకు ఇది మొదటి పౌరాణిక చిత్రం. ఈ ప్రాజెక్ట్ కోసం ఆమె చాలా కష్టపడింది కానీ ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. బాక్సాఫీస్ వద్ద ఘోరంగా నిరాశపర్చడంతో అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. అయితే సమంత ప్రస్తుతం యాక్షన్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ ఇండియన్  వెర్షన్‌తో బిజీగా ఉంది. అంతేకాదు.. రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘ఖుషి’ సినిమాలో కూడా నటిస్తోంది.

తాజాగా సమంత జిమ్ ట్రైనర్ తో కలిసి భారీ కసరత్తులు చేస్తోంది. జిమ్ లో తన బాడీని ప్రదర్శిస్తూ తన కండలు చూపెట్టింది. ఫిట్‌నెస్ లక్ష్యాల కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. బ్లాక్ కలర్ జిమ్ ప్యాంట్, తెల్లటి టాప్ ధరించిన సమంత తన టోన్డ్ బాడీని బయటపెట్టింది. #FridayFitness అంటూ సమంత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి షూటింగ్ టర్కీ లో జరుగుతోంది. అక్కడి అందాలను ఆస్వాదిస్తున్న సమంత విజయ్ తో కలిసి సరదాగా దిగిన ఒక పిక్ ని  ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. విజయ్ ఫ్రెండ్ షిప్ గురించి సమంత పెట్టిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అయ్యింది.

రాజ్ & డీకే నిర్మిస్తున్న ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్‌లో సమంత మహిళా పాత్ర పోషిస్తోంది. వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటిస్తుండగా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఖుషి’లో ఆమె కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. నందిని రెడ్డితో సిద్ధు జొన్నలగడ్డ తదుపరి చిత్రంలో కూడా ఆమె కథానాయికగా నటించవచ్చని వార్తలు వస్తున్నాయి.

Also Read: Baby Girl Death: హైదరాబాద్ లో ఘోరం.. చిన్నారి ప్రాణం తీసిన కార్ డోర్!