Samantha: హనుమాన్ మూవీపై సమంత ప్రశంసల జల్లు

  • Written By:
  • Publish Date - January 19, 2024 / 11:43 PM IST

Samantha: తేజ సజ్జా హీరోగా నటించిన హానుమాన్ మూవీ సంక్రాంతి పండుగకు విడుదలైన విషయం తెలిసిందే. పండుగ నేపథ్యంలో భారీ హీరో సినిమాలు విడుదలైనప్పటికీ హనుమాన్ వెనక్కి తగ్గలేదు. సీనియర్ హీరోల నుంచి పోటీని తట్టుకుంటూ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ మూవీపై అన్ని వర్గాల ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాాగా టాలీవుడ్ ప్రముఖ నటి సమంత రియాక్ట్ అయ్యింది. ఈ మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు. మనల్ని మళ్లీ బాల్యంలోకి తీసుకెళ్లగలిగే సినిమాలో ఎంతో ఉత్తమమైవని అని చెప్పారు సమంత. హనుమాన్‌లో అద్బుతమైన విజువల్స్‌, మంచి కామెడీతో పాటు మ్యూజిక్‌ ఉన్నాయని చెప్పారు. థాంక్యూ ప్రశాంత్‌ అంటూ డైరెక్టర్‌కు చెప్పారు.

నీయూనివర్స్‌ నుంచి రాబోయే తదుపరి సినిమా కోసం తాను ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు సామ్‌ అన్నారు. ఇక ఇందులో ప్రధాన పాత్రలో నటించిన తేజ సజ్జ నటన కూడా అద్భుతంగా ఉందని చెప్పింది సామ్. హనుమంతుడి పాత్ర అయితే.. మూవీకి హార్ట్‌ అని చెప్పింది. ఇందులో నటించి మంచి హిట్‌ అందుకున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ సమంత శుభాకాంక్షలు చెప్పింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది.

తాజాగా హనుమన్ చిత్రాన్ని ప్రత్యేకంగా బాలకృష్ణకు చూపించారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. హనుమాన్ లో అద్భుతమైన కంటెంట్ ఉంది. ఇప్పుడున్న టెక్నిక్ ని బ్రహ్మాండంగా వాడుకొని దర్శకుడు చాలా అద్భుతంగా చిత్రాన్ని తీర్చిదిద్దారు. హను-మాన్ కన్నుల పండగలా ఉంది. శ్రీరాముడు, ఆంజనేయస్వామి వారు ఆశీస్సులతో ప్రేక్షకులకు అద్భతమైన చిత్రాన్ని అందించారు. సినిమా మేకింగ్ లో చాలా ప్యాషన్ కనిపించింది. సినిమా తీయడానికి రెండున్నరేళ్ళు పట్టిందదంటే మామూలు విషయం కాదు. హనుమాన్ టీం అందరికీ అభినందనలు. హనుమాన్ సెకండ్ పార్ట్ కోసం ఎదురుచూస్తున్నాను’’ అన్నారు.