జీవితంలో కొన్ని కష్టాలు ఎదురైనప్పుడే.. మరింత కష్టపడి పనిచేస్తాం. టాలీవుడ్ హీరోయిన్ సమంత కూడా అంతే. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. తనను తానూ ప్రూవ్ చేసుకునేందుకు ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. కెరీర్ లో మొదటిసారి ఐటెం సాంగ్ చేసి అందరినీ ఆశ్చర్యపర్చింది. చాలామంది సమంత ప్రవర్తనకు షాక్ అయిన సమంత మాత్రం ‘ఇదంతా వర్క్ లో భాగమే’ అని తేల్చి చెప్పింది. పుష్ప సినిమా ఎంత హిట్టో.. సమంత ఐటెం సాంగ్ అంతకంటే హిట్. అందుకే ఆ పాట నేటికీ హోరెత్తిస్తోంది. సమంత తాజాగా ఐటెం కోసం ఎంత కష్టపడిందో రిహార్సల్స్ వీడియో ఒకటి విడుదల చేసింది. ఆ వీడియో చూసిన ప్రతిఒక్కరూ వావ్ సామ్… సో హాట్.. రీయల్లీ గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మీరూ చూసేయ్యండి.
Sam Spiced : రిహార్సల్స్ లోనూ సమంత ఇరగదీసింది!

Samantha