Site icon HashtagU Telugu

Samantha : చిన్న పిల్లలతో సమంత.. క్యూట్ ఫోటోలు షేర్ చేసి..

Samantha Shares Photos with School Children's

Samantha Shares Photos with School Children's

సమంత(Samantha) ప్రస్తుతం కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన ఆరోగ్యంపై ఫోకస్ చేయడానికి ప్రస్తుతం సమంత పలు దేశాలు తిరిగేస్తూ రకరకాల చికిత్సలు తీసుకుంటూ లైఫ్ ని ఆస్వాదిస్తోంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటోంది సామ్. తాజాగా చిన్న పిల్లలతో సరదాగా ఉన్న ఫోటోలని సమంత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

సమంత ‘ఏకమ్'(Ekam) అనే పేరుతో ప్రీ ప్రైమరీ స్కూల్స్ నడుపుతున్న సంగతి తెలిసిందే. అక్కడి పిల్లలకు చదువుతో పాటు ఎక్స్‌ట్రా యాక్టివిటీస్, మన కల్చర్ కూడా ఎక్కువగా నేర్పిస్తారు. తాజాగా తన ‘ఏకమ్’ స్కూల్స్ కి వెళ్లిన సమంత అక్కడి పిల్లలతో సరదాగా కాసేపు గడిపింది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

పిల్లలతో ఉన్న ఫోటోలను సమంత తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసి.. ఒక పుస్తకం, ఒక పెన్, ఒక టీచర్, చిన్న పిల్లలు ప్రపంచాన్ని మార్చగలరు అని పోస్ట్ చేసింది. దీంతో సమంత ఫోటోలు వైరల్ గా మారాయి. ఇన్ని రోజులు సమంత భూటాన్ లో ఎంజాయ్ చేసి ఇటీవలే హైదరాబాద్ కి తిరిగి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ సారి ఎక్కడికి ట్రిప్ వేస్తుందో చూడాలి.

 

Also Read : Abhiram : దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి.. సైలెంట్ గా రానా తమ్ముడి వివాహం..