Samantha : అందమైన జీవితాన్ని మీరు నిర్మించుకుంటే!

టాలీవుడ్ బ్యూటీ సమంత, నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటోంది. రోజుకో మోటివేషన్ కోట్స్ షేర్ చేస్తూ వార్తాల్లో ప్రముఖంగా నిలుస్తోంది.

  • Written By:
  • Publish Date - November 9, 2021 / 05:52 PM IST

టాలీవుడ్ బ్యూటీ సమంత, నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటోంది. రోజుకో మోటివేషన్ కోట్స్ షేర్ చేస్తూ వార్తాల్లో ప్రముఖంగా నిలుస్తోంది. తాజాగా ఆమె మరో కొటేషన్ ను షేర్ చేశారు. నాకు నెంబర్ వన్ కావాలని, యజమాయిషీ చెలాయించడం లేదని చెప్పింది. ఈ సందర్భంగా గ్రేట్ రచయిత్రి జామీ వారోన్ రాసిన కోట్ ను. “మీరు సామ్రాజ్యాన్ని నిర్మించాల్సిన అవసరం లేదు? పరిశ్రమను శాసించాలా? లేక దేనిలోనైనా నంబర్ వన్ అవ్వాలా? మీకు సంతోషాన్ని కలిగించే, మీకు ఆనందాన్ని కలిగించే అందమైన జీవితాన్ని మీరు నిర్మించుకుంటే? విజయం మీకు ఎలా కనిపిస్తుందో మీరు పునర్నిర్వచించినట్లయితే? అంటూ షేర్ చేసింది.

ఇప్పుడే మీకు సంతృప్తిగా అనిపిస్తే? మీరు ఎప్పుడైనా అనుకున్నదానికంటే మీ జీవితం మీ ఆదర్శానికి చాలా దగ్గరగా ఉందని మీరు గ్రహించినట్లయితే? మీరు మీ జీవితాన్ని చూసే ఫిల్టర్‌ని మార్చినట్లయితే ప్రతిదీ మరింత ఉత్సాహభరితంగా ఉంటే? మీరు సంపాదించాలని ఆలోచించడం మానేసినట్లయితే, మీరు మరింత కష్టపడటం వదిలిపెట్టినట్లయితే, మీ జీవితంలోని వాస్తవ జీవితంలో మీరు ఎంత సమయం గడపవచ్చు? ఈ క్షణం మీ కోసం ఎంత అందంగా ఉంటుంది? అంటూ తనకిష్టమైన మోటివేషన్ కోట్స్ ను షేర్ చేసింది సమంత. అయితే సమంత వరుసగా ట్రిప్స్ వేస్తూ, ఫ్రెండ్స్ తో పార్టీలు చేసుకుంటూ ఆనందంగా గడుపుతోంది.