Site icon HashtagU Telugu

Samantha : విడాకులు, సినిమా ఫ్లాప్స్, ఆరోగ్య సమస్యలు.. అన్ని ఒకేసారి వచ్చాయి.. సమంత సంచలన వ్యాఖ్యలు..

Samantha Sensational Comments n Her Movies Health Issues and Divorce

Samantha Sensational Comments n Her Movies Health Issues and Divorce

సమంత(Samantha) ప్రస్తుతం సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చి పలు దేశాలు తిరుగుతూ మయోసిటిస్ కి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఫోటో ఫోటోలు, తన ట్రావెల్ గురించి షేర్ చేస్తుంది. తాజాగా ఓ బాలీవుడ్(Bollywood) మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ నేపథ్యంలో తన సమస్యల గురించి కూడా మాట్లాడింది.

సమంత మాట్లాడుతూ.. జీవితంలో కష్టాలు అన్ని ఒకేసారి వచ్చాయి. విడాకులు, ఆరోగ్య సమస్యలు, సినిమా ఫ్లాప్స్.. ఇలా అన్ని ఒకేసారి రావడంతో చాలా బాధపడ్డాను. ఈ సమస్యలతో దాదాపు రెండు సంవత్సరాలుగా నేను ఇబ్బంది పడుతున్నాను. ఇలా ఆరోగ్య సమస్యలు, పర్సనల్ బాధలతో ఇబ్బందిపడే స్టార్స్ గురించి తెలుసుకున్నాను. అలాంటి వాళ్ళు వాటిని ఎదుర్కొని ఎలా పైకి వచ్చారు అని తెలుసుకొని నేను కూడా నా బాధల నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తున్నాను. వారు అలా నిలబడినప్పుడు నేను కూడా నా సమస్యలను ఎదుర్కోగలను అని ధైర్యం వచ్చింది అని తెలిపింది.

అలాగే.. ఈ గ్లామర్ ఫీల్డ్ లో కేవలం సినిమా, అవార్డులు, మేము ధరించే దుస్తులే కాదు వీటితో పాటు మాకు కూడా కష్టాలు ఉంటాయి. నా కష్టాలు చెప్పుకోవడానికి నేను బాధపడట్లేదు. నాలాగే ఇబ్బందులు పడేవారు ధైర్యంగా పోరాడాలని కోరుకుంటున్నాను అని తెలిపింది. దీంతో సమంత చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇలా ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలన్నీ తన సోషల్ మీడియాలో ఓ బోల్డ్ ఫోటోతో షేర్ చేయడంతో మరింత వైరల్ గా మారాయి ఈ కామెంట్స్.

 

Also Read : Kannappa : కన్నప్ప సినిమాలో ఇద్దరు పెదరాయుడులు.. ఇంకెంతమంది స్టార్ కాస్ట్ ని తెస్తారో..