హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకించి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తన నటనతో తెలుగు ఆడియన్స్ లో స్టార్ హీరోలతో సమానంగా అభిమానాన్ని సంపాదించుకుంది. ఇక సమంత ఏ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యిందని ప్రశ్నిస్తే.. ఏమాత్రం డౌట్ లేకుండా ప్రతి ఒక్కరు ‘ఏ మాయ చేశావే'(Ye Maya Chesave) అని టక్కున సమాధానం ఇచ్చేస్తారు. అయితే సమంత ఈ సినిమా కంటే ముందు తెలుగులో మరో మూవీ కోసం ఆడిషన్ ఇచ్చిందట. ఒకవేళ అందులో సెలెక్ట్ అయ్యి ఉంటే.. ఆ సినిమాతోనే టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయం అయ్యేది.
ఇంతకీ అది ఏ సినిమా ఆంటే.. ‘నిన్ను కలిశాక’ (Ninnu Kalisaka) అనే ఒక యూత్ ఫుల్ మూవీ. ‘మనీ’, ‘మనీ మనీ’, ‘సిసింద్రీ’ వంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు శివ నాగేశ్వరరావు.. 2009లో కొత్త వారితో ఒక సినిమా చేయాలని భావించాడు. ఈక్రమంలోనే ‘నిన్ను కలిశాక’ చిత్రంకి హీరోయిన్ కోసం సమంతని ఆడిషన్ చేశారు. సమంత కూడా ఆ ఆడిషన్ అదరగొట్టేసింది. దర్శకుడికి సమంత యాక్టింగ్ బాగా నచ్చింది గాని, ఆమె అడిగిన రెమ్యూనరేషన్ నచ్చలేదు. సమంత అడిగిన పారితోషకం వల్ల సినిమా బడ్జెట్ పెరిగే అవకాశం ఉంది. అందుకనే సమంతని ఆ సినిమాలోకి తీసుకోలేదు.
ఈ విషయాన్ని డైరెక్టర్ శివ నాగేశ్వరరావు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఆ సినిమా కోసం సమంత ఇచ్చిన ఆడిషన్ తనని బాగా ఆకట్టుకున్నట్లు కూడా చెప్పుకొచ్చాడు. ఇక ఆ తరువాత కొన్ని రోజులకు గౌతమ్ వాసుదేవ్ మేనన్ తెరకెక్కిస్తున్న ‘ఏ మాయ చేశావే’కి ఆడిషన్ ఇవ్వడం, సెలెక్ట్ అవ్వడం, ఎంట్రీ ఇవ్వడం జరిగిపోయింది. ఇక అక్కడి నుంచి మొదలైన సమంత కెరీర్ ఇప్పుడు ఇండియా వైడ్ ఫేమ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం కొన్నాళ్ళు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసి ఆ సినిమా చేయకపోవడమే మంచిదయింది, చేస్తే గుర్తింపు వచ్చేది కాదు. ఏ మాయచేసావే సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది సమంతకు అని అభిమానులు భావిస్తున్నారు.
Also Read : The Deserving: టాలీవుడ్ ప్రతిభతో తొలి హాలివుడ్ మూవీ “ది డిజర్వింగ్”