Site icon HashtagU Telugu

Samantha : అతనికి బర్త్ డే విష్ చేసి ఐలవ్యూ చెప్పిన సమంత..!

Samantha Blasting Remuneration for Citadel

Samantha Blasting Remuneration for Citadel

Samantha సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఏ చిన్న న్యూస్ అయినా సరే ఇట్టే వైరల్ అవుతుంది. ఎందుకో మీడియాకు ఆమె మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది. నాగ చైతన్యతో డైవర్స్ తీసుకున్న తర్వాత సమంత రిలేషన్ షిప్ స్టేటస్ మీద తరచు ఏవేవో వార్తలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా తనతో పనిచేసే టీం మేట్స్ తో సమంతని లింక్ పెడుతుంటారు. సమంతతో కొన్నాళ్లుగా పరిచయం ఉన్న తన స్టైలిస్ట్ ప్రీతం జుకల్కర్ తో సమంతని కలిపి వార్తలు రాస్తుంటారు.

మంచి స్నేహితులుగా ఉంటున్న వారి మధ్య ఏదో జరుగుతుంది అన్నట్టుగా వార్తలు రాస్తుంటారు. అయితే వారిద్దరు ప్రవర్తించే తీరు కూడా అందుకు కారణాలుగా చెప్పొచ్చు. మొన్నటిదాకా సమంత ప్రీతం మధ్య ఏదో జరుగుతుందని హడావిడి చేసిన మీడియా ఈమధ్య సైలెంట్ అయ్యింది. అయితే లేటెస్ట్ గా సమంత పోస్ట్ తో మళ్లీ ఆ వార్తలకు ఊతమిచ్చేలా చేసింది.

ఇంతకీ సమంత ఏమని పోస్ట్ చేసింది అంటే ప్రీతం జుకల్కర్ పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్ డే బేబీ బోయ్.. నీతో పాటు నువ్వున్న ప్రపంచం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యు.. ఐలవ్యూ అని మెసేజ్ చేసింది సమంత. అంతా బాగానే ఉంది కానీ ఐలవ్యూ చెప్పడం ఏంటని సమంత యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇష్టం అనేద్ ఎవరు ఎవరితో అయినా ఉంటుంది.

ఐలవ్యూ అన్నది కేవలం ప్రేమికులు మాత్రమే చెప్పాలన్న రూల్ ఏమి లేదు కదా అని సమంత ఫ్యాన్స్ ఆన్సర్ ఇస్తున్నారు. ఏది ఏమైనా సమంత ఇలా సోషల్ మీడియా వేదికగా ఐలవ్యూ అని తన స్టైలిస్ట్ కి చెప్పడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.