Site icon HashtagU Telugu

Samantha: ఆ విషయంలో ఇప్పటికీ గర్వపడుతున్నాను.. సమంత కామెంట్స్ వైరల్?

Mixcollage 17 Mar 2024 11 31 Am 4171

Mixcollage 17 Mar 2024 11 31 Am 4171

టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి మనందరికి తెలిసిందే. ఇటీవల కాలంలో సమంత పేరు తరచూ ఏదోక విషయంతో సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. సినిమాలకు సంబంధించిన విషయాలలో అలాగే సోషల్ మీడియాకు సంబంధించిన విషయాలలో సమంత పేరు వినిపిస్తూనే ఉంది. కాగా తెలుగులో సామ్ గత 14 ఏళ్ళుగా హీరోయిన్ గా రానిస్తున్న విషయం తెలిసిందే. ఏమాయ చేసావే మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది.

అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. కానీ వ్యక్తిగత జీవితంలో ఎదురైన సంఘటనలతో ఆమె లైఫ్ మలుపులు తిరిగింది. వరుస అవకాశాలతో నంబర్ వన్ హీరోయిన్ గా దూసుకుపోయిన ఆమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. మానసిక సంఘర్షణ మయోసైటిస్ సమస్యలతో పోరాడుతూ తిరిగి వెండితెరపై మెరిసేందుకు ప్రయత్నిస్తోంది సామ్. ఇది ఇలా ఉంటే ఇటీవల ఇండియా టూడే కాన్ క్లేవ్ 2024కు హాజరయిన సమంత తన కెరీర్ లో చేసిన అత్యంత కష్టతరమైన పాత్ర గురించి చెబుతూ ఆ విషయంలో ఇప్పటికీ గర్వపడుతున్నాను అని చెప్పుకొచ్చింది.

సిటాడెల్ సినిమాలో నేను పోషించిన పాత్రలో నా జీవితంలోనే అత్యంత కష్టతరమైన పాత్ర. ఎందుకుంటే ఆ సిరీస్ షూటింగ్ జరుగుతున్న సమయంలో నేను బలహీనంగా ఉన్నాను. అందుకే నాకు సిటాడెల్ సిరీస్ ఇప్పటికే సక్సెస్ అయ్యిందని భావిస్తున్నాను. ఎందుకంటే కష్టమైన పరిస్థితులలో ఆ సిరీస్ కంప్లీట్ చేశాను. నేను ఆ సిరీస్ పూర్తి చేస్తానని అసలు అనుకోలేదు. మళ్లీ దాని గురించి అడుగుతుంటే ఇప్పుడు నేను చాలా గర్వపడుతున్నాను అని మాత్రం చెప్పగలను అని చెప్పుకొచ్చింది సమంత. సిటాడెల్ చిత్రీకరణ సమయంలోనే తనకు మయోసైటిస్ సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయిందని.. ఆ తర్వాత ఖుషి చిత్రంలోనూ నటించినట్లు తెలిపింది. ఖుషి సినిమాలో మయోసైటిస్ సమస్య మరింత ఇబ్బంది పెట్టడంతో నటన నుంచి కొంతకాలం పాటు విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చింది.