మ్యారేజ్ బ్రేకప్.. అనారోగ్య సమస్యలు.. వ్యక్తిగత ఒత్తిళ్లు.. లాంటి సమస్యలు ఒకేసారి దాడిపై చేస్తే ఎవరైనా ‘నా జీవితం ఇంతేనేమో’ అని తలుచుకుంటూ బాధపడిపోతారు. కానీ టాలీవుడ్ నటి సమంత (Samantha) తగ్గేదేలే అంటూ పడిలేచిన కెరటంలా సమస్యలను అధిగమిస్తోంది. ఇటీవల అరుదైన వ్యాధి నుంచి కోలుకొని మళ్లీ కం బ్యాక్ (Come Back) ఇచ్చింది. అరుదైన వ్యాధిని ఎలా జయించింది? ఎలాంటి ఫుడ్ తీసుకుంది? తాను ఏవిధంగా రికవరీ అయ్యానో లాంటి విషయాలను పంచుకుంది. ఫిట్‌నెస్ ట్రైనర్, జునైద్ షేక్ సలహాలు, సూచనలతో పూర్తిగా ఫిట్ గా మారానని సమంత చెప్పింది.
తాను ఒకవైపు వ్యాధిని భరిస్తూనే, సెలైన్ బాటిల్ తో డబ్బింగ్ చెప్పానని కఠిన పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ‘‘ఫిట్ నెస్ (Fitness) ట్రైనర్ సూచనలతో వ్యాధి నుంచి క్రమక్రమంగా బయటపడ్డాను. అనారోగ్య సమయంలో ఎంతోమంది మోరల్ సపోర్ట్ ఇచ్చారు. అనుకూల పరిస్థితుల్లో ఏవిధంగా ముందుకు సాగాలో తెలుసుకున్నా. యశోద (Yashoda) టీం నాకు చాలా సహకరించింది’’ అని సమంత (Samantha) చెప్పింది. తాను ఎంత వీక్ అయినప్పటికీ, చాలా స్ట్రాంగ్ అంటూ రియాక్ట్ అయ్యింది.
ఇక శాకుంతలం సినిమా కష్టాలను గుర్తుచేసుకుంది సామ్. ‘శాకుంతలం’ సినిమాలో నటించే సమయంలో నా క్యారెక్టర్ కు తగినట్లుగా ముఖంలో ఎక్స్ ప్రెషన్స్ ఒకేలా పెట్టడం, ఒకే భంగిమలో నిలబడడం చాలా కష్టంగా అనిపించేది. నడుస్తున్న సమయంలో, మాట్లాడుతున్నప్పుడు. పరిగెత్తేటప్పుడు, చివరకు ఏడుస్తున్న సమయంలోనూ ముఖంలో ఎక్స్ ప్రెషన్స్ ఒకేలా పెట్టాల్సి వచ్చేది. అలా చేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇలా ఉండటం కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాను’’ అని చెప్పింది.
వ్యాధి నుంచి కోలుకున్న సమంత తదుపరి చిత్రం శాకుంతలంలో మూవీలో కనిపించనుంది. చాలా రోజుల తర్వాత ఇటీవలే ముంబై ఎయిర్ పోర్ట్ లో సందడి చేసింది. సమంత (Samantha) యశోదలో నటించిన తర్వాత శాకుంతలం మూవీలో నటిస్తోంది. ఈ మూవీ ఫిబ్రవరి 17న గ్రాండ్ రిలీజ్ కానుంది. దర్శకుడు గుణశేఖర్. ఈ చిత్రం పౌరాణిక నాటకం ఆధారంగా తెరకెక్కుతోంది.