Samantha Ruth Prabhu Wraps Up Shoot for Citadel India : నటి సమంత ఈ మధ్య తరచూ చాలా వార్తల్లో నిలుస్తోంది. మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన సమంత.. దాని చికిత్స కోసం ఏడాదిపాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ సినిమాతో పాటు, సిటాడెల్ హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. వీటి షూటింగ్ పూర్తైన వెంటనే సినిమాలకు బ్రేక్ ఇస్తుందంటూ వార్తలు హల్ చల్ చేశాయి . దీనికి బలం చేకూరుస్తూ మూడు రోజుల క్రితం సమంత.. ‘కారవాన్ లైఫ్.. మరో మూడు రోజులు మాత్రమే’ అంటూ ఇన్ స్టా లో ఒక స్టోరీ రాసింది.
ఈ రోజు తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు అంటూ మరో పోస్ట్ చేసింది. ‘జులై 13 నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈ రోజుతో సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయింది’ అని పేర్కొంటూ కళ్ల జోడు పెట్టుకున్న ఓ ఫొటోను షేర్ చేసింది. అంతేకాదు సెట్ లో అందరికీ వీడ్కోలు చెబుతూ కనిపించింది. ఈ లెక్కన సమంత (Samantha) ఏడాది బ్రేక్ స్టార్ట్ అవ్వనుంది . రాజ్-డీకే దర్శకత్వంలో రూపొందుతున్న ‘సిటాడెల్’ లో వరుణ్‌ధవన్, సమంత నటించారు. కాగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖుషి’ సెప్టెంబర్ 1న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల అవుతుంది.
Also Read: tara sutaria : తార సుతారియా హాట్ స్టిల్స్