Samantha: మహిళలకు సమాన పారితోషికంపై సమంత స్పందన ఇదే.. ఇచ్చింది తీసుకోవడమే..!

సినీ పరిశ్రమలో పురుష నటులతో సమానంగా మహిళా నటులకు పారితోషికం చెల్లించాలన్న డిమాండ్ పై ప్రముఖ నటి సమంత (Samantha) స్పందించింది. వారంతట వారే ఇష్టపూర్వకంగా మహిళలకు చెల్లించాలి కానీ, అందుకోసం అడుక్కోకూడదన్న అభిప్రాయాన్ని సమంత వ్యక్తం చేసింది.

  • Written By:
  • Publish Date - March 28, 2023 / 02:35 PM IST

సినీ పరిశ్రమలో పురుష నటులతో సమానంగా మహిళా నటులకు పారితోషికం చెల్లించాలన్న డిమాండ్ పై ప్రముఖ నటి సమంత (Samantha) స్పందించింది. వారంతట వారే ఇష్టపూర్వకంగా మహిళలకు చెల్లించాలి కానీ, అందుకోసం అడుక్కోకూడదన్న అభిప్రాయాన్ని సమంత వ్యక్తం చేసింది. ఓ మీడియా సంస్థతో మాట్లాడిన సమంత ఈ కామెంట్లు చేసింది.

‘‘నేను చాలా గట్టిగా పోరాడుతున్నాను. కానీ నేరుగా కాదు. సమాన పారితోషికం చెల్లింపుల కోసం నేను పోరాడడం లేదు. కష్టపడడానికి, విజయానికి ఉప ఉత్పత్తి సినిమా కావాలని కోరుకుంటున్నాను. మీకు ఇంత మొత్తం చెల్లిస్తామంటూ వారు వచ్చి చెబుతుంటారు. అంతేకానీ, ఇంత ఇవ్వాలని నేనేమీ అభ్యర్థించను. ఇది అద్భుతమైన కృషితో వస్తుందని నేను నమ్ముతాను’’ అని సమంతా చెప్పింది. మీ సామర్థ్యాలను పరిమితి మేరకు, అంతకంటే కొంచెం ఎక్కువే వెలికితీయడానికే ప్రయత్నించండనే కొటేషన్ రాసుకుంటానని తెలిపింది. పరిమితికి మించి సామర్థ్యాలన్నవి మరింత కష్టపడడం ద్వారానే వస్తుందని పేర్కొంది. సమంత 2010లో ఏ మాయ చేసావే సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసింది.

Also Read: Taapsee Pannu: సినీ నటి తాప్సీపై కేసు నమోదు.. కారణమిదే..?

సమంత గతేడాది హరి-హరీష్ దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం యశోద (2022)లో కనిపించింది. ఇందులో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్‌కుమార్, మురళీ శర్మ కూడా నటించారు. ఏప్రిల్ 14న విడుదల కానున్న శాకుంతలం చిత్రంలో అభిమానులు సమంతను చూడనున్నారు. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ పౌరాణిక రొమాంటిక్ డ్రామాలో దేవ్ మోహన్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. విజయ్ దేవరకొండతో సమంత ఖుషి మూవీలో కూడా నటిస్తుంది. ఇది సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.