Site icon HashtagU Telugu

Samantha Viral: సమంత అందాల ఆరబోత!

123

123

స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్బుత‌మైన నటిగా ఇప్పటికే తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకున్నారు. ఇటీవల ‘పుష్ప’ సినిమాలో సామ్ చేసిన ఐటెంసాంగ్ అయితే యావత్ దేశాన్ని కాదు ప్రపంచంలోని సినీ ప్రియులను ఉర్రూతలూగించింది. వైవాహిక జీవితంలో ఎదురు దెబ్బ తిన్నప్పటికీ, తాను నమ్ముకున్న యాక్టింగ్ లో మాత్రం దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఒక్క యాక్టింగ్‌ తోనే కాదు.. స‌మయాన్ని బట్టి త‌న‌లోని గ్లామ‌ర‌స్ యాంగిల్‌ ను అప్పుడప్పుడు బ‌య‌ట‌పెడుతుంది సమంత. సోష‌ల్‌ మీడియాలో సామ్‌కు ఉండే ఫాలోవ‌ర్లు కానీ, ఆమెకుండే క్రేజ్ కానీ… ఏ లెవెల్ ఉంటుందో మనందరికీ తెలుసు.

ఎప్పుడూ ఏదో ఒక అప్ డేట్‌ తో నెట్టింట పోస్టులు పెడుతూ… త‌న ఫాలోవ‌ర్ల‌లో మాంచి జోష్ నింపుతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ హాట్ హాట్ పోజులత ఇన్ స్టాగ్రామ్‌ లో కొత్త క‌వ‌ర్ ఫొటో ను అంద‌రితో పంచుకుంది. స్కిన్నీ అవుట్ ఫిట్‌ లో అందాన్ని ఆర‌బోస్తూ..మ‌త్తెక్కించే చూపుతో కుర్ర‌కారు మ‌న‌సు దోచేస్తుంది. సామ్ స‌రికొత్తగా ద‌ర్శ‌న‌మిస్తున్న న్యూ క‌వ‌ర్ ఫొటో ఇపుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఇక మరోవైపు ఈ భామ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా గడుపుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ త‌మిళ ద‌ర్శ‌కుడు విఘ్నేశ్ శివ‌న్ దర్శకత్వం వహించిన ‘కాతువాకుల రెండు కాధ‌ల్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో సమంత తో పాటు నయనతార కూడా నటించింది. మూవీ కంప్లీట్ చేసిన సంద‌ర్భంగా సెట్స్ లో కేక్ క‌ట్ చేసి దిగిన ఫొటోలను విడుదల చేయడంతో… ప్రస్తుతం ఈ ఫొటోలు ఆన్‌లైన్‌లో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.