Samantha: అవన్నీ రూమర్స్.. సల్మాన్ ఖాన్ తో నేను సినిమా చేయటం లేదు: సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఈ మధ్య బాలీవుడ్ డెబ్యూకు సిద్ధమవుతోందని, ఒక స్టార్ హీరోతో తన సినిమా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సమంత ఈ వార్తలపై స్పందించింది.

Published By: HashtagU Telugu Desk
Samantha

I Don't Beg Anyone.. Take As Much As They Give.. Samantha Ruth Prabhu

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఈ మధ్య బాలీవుడ్ డెబ్యూకు సిద్ధమవుతోందని, ఒక స్టార్ హీరోతో తన సినిమా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సమంత ఈ వార్తలపై స్పందించింది. దీంతో బాలీవుడ్‌లో సమంత ఎంట్రీ ఉంటుందా లేదా అని సందేహపడుతున్న ఫ్యాన్స్‌కు ఒక క్లారిటీ వచ్చింది. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్‌తో సమంతకు మంచి సాన్నిహిత్యం ఉంది. హిందీలో సామ్‌కు బాగానే పాపులారిటీ లభించింది. దానికి కారణం ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్.

ఈ సిరీస్ తర్వాత సమంత పూర్తిస్థాయిలో హీరోయిన్‌గా ఒక హిందీ చిత్రంలో ఎప్పుడు నటిస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూడడం మొదలుపెట్టారు. ఫ్యాన్స్‌లో పెరిగిన హైప్ చూసి తనను బాలీవుడ్‌లో లాంచ్ చేయాలని కరణ్ ఎదురుచూస్తున్నాడు. ఇక తాజాగా కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సల్మాన్ ఖాన్ నటిస్తున్న చిత్రంలో సమంతనే హీరోయిన్ అని రూమర్స్ బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా చక్కర్లు కొట్టడం మొదలయ్యింది. ఈ విషయంపై సమంత తాజాగా స్పందించింది.

Also Read: Gooseberry : ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు ఉసిరికాయను తినవద్దు..

సమంత చివరిగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి చిత్రంలో నటించింది. ఈ మూవీ క్లిన్ హిట్‌గా నిలిచింది. ఇందులో విజయ్ దేవరకొండతో సమంత కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. ఈ మూవీ తర్వాత సమంత సినిమాల నుండి కొన్నిరోజులు బ్రేక్ తీసుకోనుందని, తన ఆరోగ్యంపై దృష్టిపెట్టనుందని క్లారిటీ ఇచ్చేసింది. విష్ణువర్ధన్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రంలో సమంత హీరోయిన్ అనే వార్తలకు ఒక క్లారిటీ ఇచ్చింది.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పాల్గొంది సమంత. అదే సమయంలో తన తరువాతి ప్రాజెక్ట్ ఏంటి అని సామ్‌ను అడగగా.. ‘నా తరువాతి ప్రాజెక్ట్ అసలు ఏమీ లేకపోవడమే. ప్లాన్ లేకపోవడమే’ అంటూ క్లారిటీ ఇచ్చింది. ‘నేను పనిచేయబోతున్న ప్రాజెక్ట్స్ గురించి మరింత ఆలోచించి ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాను. నా కంఫర్ట్ జోన్ నుండి బయటపడేసే పాత్రలు నాకు కావాలి. అలాంటి పాత్ర వచ్చేవరకు నేను ఇలాగే ఉండడానికి సిద్ధం’ అని సమంత తెలిపింది.

  Last Updated: 21 Sep 2023, 06:31 AM IST