Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా (Samantha) రూత్ ప్రభు తన అభిమానులకు, సినీ వర్గాలకు ఊహించని శుభవార్త అందించింది. నిర్మాత రాజ్ నిడిమోరును ఆమె వివాహం చేసుకున్నారు. సోమవారం కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ వేదికగా ఈ వివాహ వేడుక సింపుల్‌గా, స్వీట్‌గా జరిగింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారిక ప్రకటన
నిన్నటి వరకు వారి పెళ్లిపై వచ్చిన వార్తలపై సమంతా టీమ్ మౌనం వహించినప్పటికీ మధ్యాహ్నం సమయానికి సమంతా స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఆకర్షణీయమైన ఫోటోలను పోస్ట్ చేసి, తన రిలేషన్‌షిప్‌ను అధికారికం చేసింది. “01.12.2025” అని రాసి, తెల్లటి హార్ట్ ఎమోజీలను జోడించింది.
https://twitter.com/Movies4u_Officl/status/1995407624565928276
Also Read: Home Remedies : షుగర్, హై కొలెస్ట్రాల్ తగ్గడానికి హెర్బల్ టీ..! ఇంట్లో ఎలా చేసుకోవాలంటే
సాంప్రదాయ పద్ధతిలో వేడుక
ఒక చిత్రంలో వారు లింగ భైరవి ముందు నిలబడి ఉంగరాలు మార్చుకున్నారు. సమంతా ఎరుపు, బంగారు రంగుల సాంప్రదాయ చీరలో, తలలో తాజా పువ్వులతో అద్భుతంగా మెరిసింది. రాజ్ క్రీమ్ కలర్ నెహ్రూ జాకెట్‌తో తెలుపు కుర్తా ధరించారు. వివాహంలో భాగంగా ఈ జంట హారతి తీసుకుంటూ విగ్రహం ముందు మోకరిల్లి ఆశీర్వాదం పొందారు. ప్రస్తుతం ఈ జంట వివాహ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనుపమ పరమేశ్వరన్, నిమ్రత్ కౌర్, డింపుల్ హయతి సహా అనేక మంది ప్రముఖులు, అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేశారు.
రాజ్ నిడిమోరు తన మొదటి భార్య శ్యామలి దే నుండి విడిపోయినట్లు అధికారికంగా ప్రకటించకపోయినా.. సమంతా (నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత), రాజ్ 2024 ప్రారంభం నుంచే డేటింగ్‌లో ఉన్నట్లు ఊహాగానాలు వచ్చాయి. ఈ జంట అనేక బహిరంగ కార్యక్రమాలలో కలిసి కనిపించడంతో ఈ పుకార్లకు బలం చేకూరింది. ఇప్పుడు ఈ వివాహంతో ఆ పుకార్లన్నింటికీ తెరపడింది.
