Site icon HashtagU Telugu

Samantha: సమంత నెల సంపాదన ఎంతో తెలుసా? ఆమెకు ఎన్ని కోట్ల ఆస్తి ఉందంటే?

Samantha

Samantha

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి మనందరికి తెలిసిందే. సమంత చివరగా ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాధి బారిన పడిన సమంతా గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ఈ విషయం గురించి సఫర్ అవుతూనే ఉంది. కాగా ఇండస్ట్రీలో 15 ఏళ్ల నుంచి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది సమంత. సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, రకరకాల బిజినెస్ ల ద్వారా ఆమె కోట్లు సంపాదిస్తోంది.

సమంత, నాగ చైతన్య 2017లో పెళ్లి చేసుకున్నారు. 2021లో విడిపోయారు. విడాకుల గురించి చాలా రూమర్స్ వచ్చాయి. అంతే కాదు త్వరలో ఆమె రెండో పెళ్ళి కూడా చేసుకుంటుంది అని టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంతకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే.. సమంత ఒక్కో సినిమాకు రూ.3.5 నుంచి 5 కోట్లు తీసుకుంటుందని సమాచారం. వెబ్ సిరీస్ కోసం అయితే 10 కోట్ల వరకూ తీసుకుంటుందట. ఇక సమంత ఆస్తి మొత్తం 100 కోట్ల పైనే ఉంటుందని టాక్. అయితే సమంత కేవలం సినిమాలను మాత్రమే నమ్ముకోలేదు.

సమంత రియల్ ఎస్టేట్‌ లో పెట్టు బడులు పెట్టింది. ఆమె దగ్గర డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్, సీ పేసింగ్ ఇల్లు కూడా ఉన్నాయట. ఇకపోతే సామ్ కలెక్షన్ ల విషయానికి వస్తే.. సమంత దగ్గర BMW 7 సిరీస్, జాగ్వార్ XF, ఆడి Q7, మెర్సిడెస్ బెంజ్ G63 AMG కార్లు ఉన్నాయి. సమంత చాలా బ్రాండ్లలో పెట్టు బడులు పెట్టింది. పిల్లల చదువు కోసం కూడా సపోర్ట్ చేస్తుంది. ఎన్నో సమాజ సేవలు చేస్తోంది. క్లాత్, జ్యూవ్వెలర్రీ బిజినెస్ లో కూడా ఇన్వెస్ట్ చేసిందని సమాచారం. ప్రస్తుతం సమంత నెమ్మదిగా ఆ వ్యాధి నుంచి కోలుకుంటోంది. మళ్లీ సినిమాలలో బిజీబిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది. సమంత ఎంట్రీ కోసం కూడా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.