Site icon HashtagU Telugu

Watch Video: ఈ స్టార్స్ ‘టైటానిక్’లో నటిస్తే.. వీడియో వైరల్!

Samantha

Samantha

టైటానిక్.. ఎంతోమంది మనసులను దోచిన సినిమా. హీరోహీరోయిన్స్ కేట్, లియోనార్డ్ అద్భుత నటనను ఇప్పటికీ మరచిపోలేం. సినిమాల గురించి మాట్లాడుకునే క్రమంలో టైటానిక్ ప్రస్తావన తేకుండా ఉండలేం. ఆ సినిమా, అందులోని సన్నివేశాలు బలంగా ముద్ర వేశాయి కాబట్టే ప్రతిఒక్కరూ టైటానిక్ ను ఇష్టపడతారు. తాజాగా హీరోయిన్స్ నయనతార, సమంత, విజయ్ సేతుపతి టైటానిక్ మూవీలోని హీరోహీరోయిన్ల పాత్రలను కాపీ కొట్టే ప్రయత్నం చేశారు. సేమ్ టు సేమ్ ఆ సినిమా సన్నివేశాలను చిత్రీకరించారు. సామ్, నయన్ నల్లగౌను ధరించి హోయలు పోతుంటే.. విజయ్ సేతుపతి లియోనార్డ్ గెటప్ లో షూటింగ్ కు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చిత్రనిర్మాత విఘ్నేష్ శివన్ తన రాబోయే తమిళ రొమాంటిక్ కామెడీ కాతు వాకుల రెండు కాదల్ నుండి తెరవెనుక గడిపిన నిమిషాలను షేర్ చేశారు. వీడియోలో,నయనతార, సమంత రూత్ ప్రభు ఇద్దరూ నల్లటి గౌన్లు ధరించగా, విజయ్ సేతుపతి లియో నార్డో మాదిరిగా మేక్ ఓవర్ చేసుకున్న సన్నివేశాలను ఈ వీడియోల చూడొచ్చు. షూట్ చేసే క్రమంలో ఈ  ముగ్గురు స్టార్స్ నవ్వులు చిందించారు.