Site icon HashtagU Telugu

Gelato : సమంత ఫ్యామిలీలోకి కొత్త మెంబర్..ఎవరో తెలుసా..?

Samantha Ruth Prabhu introduces new pet Gelato

Samantha Ruth Prabhu introduces new pet Gelato

సమంత  ఫ్యామిలీ లోకి కొత్త మెంబర్ (New Pet Cat ) వచ్చారు. ఆ మెంబర్ ను గట్టిగా హత్తుకున్న పిక్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మొదటి నుండి సమంత ఏంచేసినా..ఏ నిర్ణయం తీసుకున్న..ఏ సినిమా చేసిన అది సోషల్ మీడియా లో వైరల్ అవ్వాల్సిందే. మొదటి సినిమాతోనే అందర్నీ మాయ చేసిన సామ్..అతి తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ పొజిషన్ కు వెళ్ళింది. అదే సమయంలో నాగ చైతన్య ను ప్రేమ వివాహం చేసుకోవడం..ఆ తర్వాత ఇద్దరు విడాకులు తీసుకోవడం అంతే స్పీడ్ గా జరిగిపోయింది. ఆ తర్వాత ఆమె అనారోగ్యానికి గురి అవ్వడం..చాల రోజుల చికిత్స తర్వాత క్షేమంగా బయటపడడం జరిగింది. ప్రస్తుతం సినిమాలతో బిజీ గా ఉంది.

ఇదిలా ఉంటె సమంత కు పెట్స్ అంటే ఎంతో ఇష్టమనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం సామ్ దగ్గర గత కొంతకాలంగా రెండు పెట్స్ ఉన్నాయి. వీటి పేర్లు హష్ , నాషా . ఈ రెండు పెట్స్ తో తాను ఎంతో సరదాగా గడుపుతానంటూ చాల సార్లు చెప్పుకొచ్చింది. ఇక ఇటీవల ఇదే ఫ్యామిలీలోకి మరొక పెట్ గలాటో (Gelato) వచ్చి చేరింది. గలాటో అంటే మరేదో కాదు పిల్లి పిల్ల. దాని ముద్దు పేరు గలాటో . దానినే సమంత ఇంట్లోకి కొత్త మెంబర్ వచ్చారు అంటూ ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. గలాటో తో ఉన్న ఫోటోలు సమంత తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో స్టేటస్ గా పెట్టింది.

అలా గుడ్ మార్నింగ్ చెప్తూ గలాటో తో ఉన్న ఫోటో షేర్ చేయగా నెట్టింట ఒక్కసారి వైరల్ గా మారిపోయింది. ఇక సమంత సినిమాల విషయానికి ఖుషి మరియు సియాటెల్ చిత్రాలతో బిజీగా ఉంది. ఖుషి (Kushi) మూవీ లో విజయ్ కి జోడిగా నటిస్తుంది. మజిలీ ఫేమ్ శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ లో సాంగ్స్ విడుదలై ఆకట్టుకుంటున్నాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Read Also : Faria Abdullah : మేకప్ లేకుండా ఫరియా అబ్దుల్లా నాచురల్ పిక్స్