మ్యారేజ్ లైఫ్ కు గుడ్ బై చెప్పాక సమంత తనదైన స్టైల్ లో ఎంజాయ్ చేస్తోంది. నాగచైతన్యతో బ్రేకప్ అయ్యాక స్నేహితులతో కలిసి టూర్లు, పార్టీలకు వెళ్లి రీఛార్జ్ అయ్యింది. అంతేకాదు.. గుళ్లు గోపురాలు తిరుగతూ వ్యక్తిగత సమస్యలను అధిగమించింది. అయితే ఇటీవల సమంత సినిమాలతో పాటు వెకేషన్ ను బాగా ఎంజాయ్ చేస్తోంది. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే, గ్యాప్ దొరికితే స్నేహితులు, కోస్టార్స్ తో కలిసి సందడి చేస్తోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండతో టర్కీ టూర్ ను ఎంజాయ్ చేయగా, తాజాగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో సందడి చేసింది.
కాగా సమంత పష్ప సినిమాలో ఐటెంసాంగ్ చేసిన విషయం తెలిసిందే. సినిమా విడుదలై రెండు సంవత్సరాలు కావోస్తున్నా.. ఊ అంటావా పాట నేటికి ఏదో ఒక చోట వినిపిస్తూనే ఉంది. ప్రస్తుతం సమంత, వరుణ్ ధావన్ ప్రస్తుతం సెర్బియాలో ఉన్నారు. రాజ్ & డికెతో వారి యాక్షన్ సిరీస్ సిటాడెల్ షూటింగ్ చేస్తున్నారు. శనివారం బెల్‌గ్రేడ్‌లోని నైట్ క్లబ్ లో వరుణ ధావన్ తో కలిసి సమంత సందడి చేసింది.
పుష్ప హిట్ సాంగ్ ఊ అంటవా పాటకు డాన్స్ చేసి అక్కడివారిని ఉత్సాహాపర్చింది. చేతిలో బీర్ బాటిల్ పట్టుకొని, బ్లాక్ టాప్ ధరించి మతెక్కించే స్టెప్పులు వేసింది. ఆమె అద్దాలు ధరించి అందంగా కనిపించింది. మరికొందరు ఆమెను ఉత్సాహపరుస్తారు, ఆమె అద్దాలు తీసి డాన్స్ చేయమని అడుగుతారు. వరుణ్ ధావణ్ కూడా సమంతతో సందడి చేస్తాడు. ప్రస్తుతం సమంత డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత, వరుణ్ ధావణ్ సిటాడెల్ ఇండియన్ వర్షన్ సిరీస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ ఉండటంతో సమంత అందుకు తగ్గట్టుగా భారీ వ్యాయామాలు చేస్తూ తన బాడీని తీర్చిదిద్దుకుంటోంది.
https://twitter.com/actressglam/status/1667448358729027584?cxt=HHwWgMDQ9dPc-6MuAAAA
Also Read: Hostel Girl: స్నానం చేస్తూ బాత్రూంలో పాటలు వినకూడదా? హాస్టల్ రూల్స్ పై నెటిజన్స్ ట్రోల్స్!