Samantha: పెళ్లి తర్వాత హ్యాపీగా ఉండకపోవడానికి కారణం నువ్వే.. కరణ్ జోహార్ కు షాకిచ్చిన సమంత!

టాలీవుడ్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న సమంత తాజాగా ప్రముఖ బాలీవుడ్ షో కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొంది.

  • Written By:
  • Updated On - July 2, 2022 / 09:49 PM IST

టాలీవుడ్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న సమంత తాజాగా ప్రముఖ బాలీవుడ్ షో కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొంది. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరించబోతున్న కాఫీ విత్ కరణ్ ఏడవ సీజన్ లో సమంతా పాల్గొంది. ఇకపోతే ఎందుకు సంబంధించిన ఎపిసోడ్ వచ్చేవారం ప్రసారం కానుంది. ఈ సందర్భంగా తాజాగా ఆ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఆ వీడియోలో మొత్తం బాలీవుడ్ స్టార్స్, అందులో ఒక్క సమంత మాత్రమే సౌత్ స్టార్. ఈ షోలో భాగంగా సమంత చెప్పిన ఒక విషయం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

తాజాగా వదిలిన ఈ ప్రోమోలో వరుణ్ ధావన్, అనిల్ కపూర్, అక్షయ్ కుమార్, అలియా భట్ వంటి స్టార్లున్నారు. ఇక ఈ ప్రోమోలో సమంత చేసిన కామెంట్లు ఈ ప్రోమోకే తెగ హైలెట్ అవుతున్నాయి. పెళ్లి తరువాత జీవితం అంత సంతోషంగా ఉండకపోవడానికి కారణం మీరే అంటూ కరణ్ జోహార్ ని సమంత అనేసింది. ఎందుకంటే మీరు పెళ్లి తరువాత జీవితాన్ని కభీ ఖుషీ కబీ ఘమ్ లా ఉంటుందని చూపించారు.

కానీ రియాల్టీలో మాత్రం కేజీయఫ్‌లా ఉంటుందని పరోక్షంగా తన పెళ్లి జీవితం మీద కూడా సమంత కౌంటర్ వేసుకుంది. మొత్తానికి ఈ షోలో సమంత మొదటి సారిగా ఇలా షోలో తన పెళ్లి, విడాకులు వంటి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల మీద నోరు విప్పబోతోంది. అయితే ఈ ఎపిసోడ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.