Samantha: అల్లు అర్జున్ తో రొమాన్స్ చేయనున్న సమంత, క్రేజీ అప్డేట్ ఇదిగో

Samantha: సమంత చివరిసారిగా విజయ్ దేవరకొండ నటించిన ఖుషి చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు సినిమాకు సైన్ చేయకపోవడంతో అభిమానులను అయోమయంలో పడేస్తోంది. ఇప్పుడు, ఫిల్మ్ సర్కిల్స్‌లో లేటెస్ట్ బజ్ ఏమిటంటే, అట్లీ దర్శకత్వం వహించే చిత్రంలో అల్లు అర్జున్‌తో రొమాన్స్ చేయనుంది. సామ్ అట్లీతో చర్చలు జరుపుతోంది. రెమ్యూనరేషన్ గురించి కూడా మేకర్స్‌తో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. సమంత ఈ ప్రాజెక్ట్‌ను చేజిక్కించుకుంటే అది ఆమె కెరీర్‌కు గేమ్ […]

Published By: HashtagU Telugu Desk
Parvathi Tiruvothu All Praises to Samantha after Watching Citadel Honey Bunny

Parvathi Tiruvothu All Praises to Samantha after Watching Citadel Honey Bunny

Samantha: సమంత చివరిసారిగా విజయ్ దేవరకొండ నటించిన ఖుషి చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు సినిమాకు సైన్ చేయకపోవడంతో అభిమానులను అయోమయంలో పడేస్తోంది. ఇప్పుడు, ఫిల్మ్ సర్కిల్స్‌లో లేటెస్ట్ బజ్ ఏమిటంటే, అట్లీ దర్శకత్వం వహించే చిత్రంలో అల్లు అర్జున్‌తో రొమాన్స్ చేయనుంది. సామ్ అట్లీతో చర్చలు జరుపుతోంది. రెమ్యూనరేషన్ గురించి కూడా మేకర్స్‌తో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

సమంత ఈ ప్రాజెక్ట్‌ను చేజిక్కించుకుంటే అది ఆమె కెరీర్‌కు గేమ్ ఛేంజర్. ఆమె అనారోగ్యంతో బాధపడుతున్న తర్వాత, సామ్ ఇంకా పెద్ద సినిమాలకు ఒకే చెప్పలేదు. అయితే ఈ విషయం అధికారికంగా ధృవీకరించాల్సి ఉన్నప్పటికీ, ఈ వార్త వైరల్‌గా మారింది. ఇటీవల ఈ వ్యాధి నుంచి కోలుకున్నటువంటి ఈమె సోషల్ మీడియా వేదికగా తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తున్నారు. ఇక నా శరీరం వ్యాధుల నుంచి కోలుకోవడానికి ఆహారం కూడా పూర్తిగా తగ్గించేసానని సమంత వెల్లడించిన విషయం తెలిసిందే.

  Last Updated: 01 Apr 2024, 07:05 PM IST