Site icon HashtagU Telugu

Samantha: నందిని నీ సహకారం మరువలేనిది!

Samantha

Samantha

‘ఓ బేబీ’ దర్శకురాలు నందిని రెడ్డి పుట్టినరోజు ఇవాళ. నందినిరెడ్డి బర్త్ డేను గుర్తుండిపోయేలా సమంత తన మనసులోని భావాలను షేర్ చేసుకుంది. తనలో ఆత్మవిశ్వాసం పెంపోందించడానికి నందిని ఎలా సాయపడిందో, ఏవిధంగా అండగా నిలిచారో చెప్పారు. ” నా ప్రియమైన స్నేహితురాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ మంచితనమే మీ గొప్పతనం. మీరు నాకు స్ఫూర్తినిస్తారు! నాకు అది ఎప్పటిలాగే గుర్తుంటుంది. 2012 లో నేను బాగానే ఉన్నప్పటికీ, ఎందుకో నాలో ఆత్మవిశ్వాసం లోపించింది. దీంతో షూటింగ్స్, ఇతర పనులు చేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉండేది. కానీ నీ పరిచయంతో ఎక్కడా లేని ఆత్మవిశ్వాసం వచ్చింది. నీ సలహాలను ఎప్పటికీ మరిచిపోలేను’’ అంటూ నందినితో ఉన్న ఫొటో షేర్ చేశారు సమంత.

నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత నటించిన ‘ఓ బేబీ’ చిత్రం 2014లో వచ్చిన సౌత్ కొరియన్ రీమేక్. నాగ శౌర్య, ఊర్వశి తదితరులు నటించిన ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంది. అంతేకాదు మంచి వసూళ్లను కూడా సాధించింది. త్వరలోనే సామ్, నందిని మళ్లీ ఓ మూవీ చేయనున్నట్టు వార్తలు వినిపించాయి. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.