Samantha : త్రిష ప్లేస్ లో సమంత.. చేజారిన గోల్డెన్ ఆఫర్..!

Samantha చెన్నై భామ త్రిష లేటెస్ట్ గా కండల వీరుడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ది బుల్ సినిమాలో ఛాన్స్ అందుకుందని వార్తలు

  • Written By:
  • Publish Date - January 3, 2024 / 10:38 AM IST

Samantha చెన్నై భామ త్రిష లేటెస్ట్ గా కండల వీరుడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ది బుల్ సినిమాలో ఛాన్స్ అందుకుందని వార్తలు వచ్చాయి. సల్మాన్ సినిమాకు త్రిషకు ఆఫర్ రావడం నిజమే కానీ త్రిష వరుస కమిట్ మెంట్ ల వల్ల ఆ ఆఫర్ ని కాదనేసిందట. త్రిష 13 ఏళ్ల క్రితం అక్షయ్ కుమార్ తో సినిమా చేసింది. ఆ తర్వాత సౌత్ లో బిజీ అవ్వడం వల్ల హిందీ ఛాన్స్ లు వచ్చినా సరే చేయలేదు. ఇన్నాళ్లకు మరో ఆఫర్ వచ్చినా తను వేరే సినిమాలు చేస్తుండటం వల్ల కాదన్నదట.

We’re now on WhatsApp : Click to Join

ప్రస్తుతం త్రిష చిరంజీవి విశ్వంభర సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా కోసం త్రిష బల్క్ డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా అజిత్ తో ఒక సినిమా చేస్తుంది త్రిష. సూపర్ హిట్ కాంబో అయిన అజిత్ త్రిషలు మళ్లీ కలిసి సినిమా చేయడం కోలీవుడ్ ఫ్యాన్స్ ని ఎగ్జైట్ అయ్యేలా చేస్తుంది.

అందుకే త్రిష సల్మాన్ సినిమా ఆఫర్ ని వద్దనుకుందట. అయితే త్రిష కాదన్న ఈ ఆఫర్ సమంతని వరించిందని తెలుస్తుంది. ఫ్యామిలీ మ్యాన్ 2 సీరీస్ తో బీ టౌన్ ఆడియన్స్ ని అలరించిన సమంత సిటాడెల్ సీరీస్ లో కూడా నటించింది. సల్మాన్ సినిమాలో త్రిష కు అనుకున్న పాత్రను ఇప్పుడు సమంతని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. విష్ణువర్ధన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. తెలుగులో ఖుషి తర్వాత మరో సినిమా ఓకే చెప్పని సమంత బాలీవుడ్ లో మాత్రం సినిమాలు చేసేందుకు రెడీ అంటుంది.

Also Read : Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ.. కల్ట్ మెగా ఫ్యాన్..!