Samantha : సమంత రెగ్యులర్ గా ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత హెల్త్ బాగోలేదని కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ప్రకటించింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. హెల్త్ పాడ్ కాస్ట్ లు, బిజినెస్ లతో బిజీ అవుతుంది సమంత. మరో పక్క సినిమాలు, సిరీస్ లు నెమ్మదిగా చేస్తుంది. విడాకుల తర్వాత చైతూ ఎక్కడా సమంత గురించి డైరెక్ట్ గా గాని ఇండైరెక్ట్ గా గాని స్పందించలేదు. సమంత మాత్రం తన పాస్ట్ అంటూ పలు ఇంటర్వ్యూలలో మాట్లాడింది.
అయితే గతంలో సమంత రాజ్ నిడుమోరు అనే దర్శక నిర్మాత తో డేటింగ్ చేస్తుందన్న వార్తలు వచ్చాయి. ఫ్యామిలీ మ్యాన్ దర్శక నిర్మాతలు రాజ్ & డీకేలో ఒకరు రాజ్ నిడుమోరు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో సమంత నటించి బాలీవుడ్ కి పరిచయం అయిన సంగతి తెలిసిందే. సమంత – చైతూ విడిపోవడానికి ఈ సిరీస్ కూడా ఒక కారణం అని గతంలో రూమర్స్ వచ్చాయి. అయితే ఈ సిరీస్ దర్శక నిర్మాత రాజ్ తో సమంత డేటింగ్ చేస్తుందని గతంలో వార్తలు వచ్చాయి.
మళ్ళీ ఇప్పుడు అవే వార్తలు వైరల్ గా మారాయి. ఇటీవల రెగ్యులర్ గా రాజ్ తో కనిపిస్తుంది సమంత. సమంత పికెల్ బాల్ గేమ్ లో చెన్నై టీమ్ ని కొనుక్కుందని తెలిసిందే. ఈ టీమ్ ని రాజ్ తో కలిసి కొనుగోలు చేసింది. ఇద్దరూ కలిసి బిజినెస్ చేస్తున్నారు. ఈ గేమ్ ఈవెంట్స్ లో, మ్యాచ్ ల్లో రాజ్ తో రెగ్యులర్ గా కనపడింది. దీంతో ఈ ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారనే అనుకుంటున్నారు.
అయితే ఈ వార్తలను సమంత ఖండించకపోగా నిన్న తన సోషల్ మీడియాలో.. ఈ సంవత్సరం నేను అన్నీ మరిచిపోయి ముందుకు వెళ్తాను. చాలా విశ్వాసం, ధైర్యంతో ముందడుగు వేస్తాను. అద్భుతాల్ని ఎవ్వరూ ఆపలేరు అని అర్ధం వచ్చేలా ఓ కొటేషన్ ను షేర్ చేసింది. అలాగే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నాకు ప్రస్తుతం స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయని, నిజాయితీగా ఉండే వ్యక్తులతో నిజాయితీగా కలిసి నడుస్తాను అని చెప్పింది. దీంతో ఇవన్నీ రాజ్ తో రిలేషన్ గురించే అని భావిస్తున్నారు.
అలాగే సమంత ప్రస్తుతం ఎక్కువగా ముంబైలోనే ఉంటుంది. రాజ్ కూడా ముంబైలోనే ఉంటున్నాడు. ఫ్యామిలీ మ్యాన్ తర్వాత వీరిద్దరూ కలిసి మరో సిరీస్ చేస్తున్నారు.
Also Read : Naga Chaitanya : రెగ్యులర్ గా శోభితని తెగ పొగిడేస్తున్న నాగచైతన్య.. తండేల్ ప్రమోషన్స్ లో శోభిత గురించే..