Samantha refuses Jr NTR: ఎన్టీఆర్ కు ‘నో’ చెప్పిన స‌మంత‌.. అస‌లు రీజ‌న్ ఇదే!

  • Written By:
  • Updated On - August 26, 2022 / 07:06 PM IST

టాలీవుడ్ బ్యూటీ స‌మంత గ‌త ఏడాది నుంచి ప్ర‌తిరోజు వార్త‌ల్లో నిలుస్తూనే ఉంది. మాజీ భర్త నాగ చైతన్యతో విడాకులు తీసుకున్నప్పటి నుండి, పుష్ప హిట్ పాట ‘ఊ అంటా పాట వ‌ర‌కు ప్ర‌తి అంశంలో హాట్ టాపిగ్ గా మారుతూనే ఉంది. అంతేకాదు.. బోల్డ్ సినిమాలకు సై అంటూ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. టాలీవుడ్ టాప్ హీరో మూవీని రిజెక్ట్ చేయ‌డ‌మే అందుకు కార‌ణం. దర్శకుడు కొరటాల శివ తన రాబోయే ‘NTR30’లో జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా సమంతను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

అయితే, స‌మంత భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయ‌డంతో ఎన్టీఆర్ సినిమా నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం సామ్ రూ. 4 కోట్లు వసూలు డిమాండ్ చేసింద‌ని టాక్‌. మహిళా ప్రధాన పాత్ర కోసం శివ బడ్జెట్ కేవలం 2.5 కోట్లు మాత్రమే ఫిక్స్ అయ్యారు నిర్మాత‌లు. సమంత త‌న రెమ్యున‌రేష‌న్ ను 2 కోట్ల నుండి 3.5-4 కోట్లకు పెంచిందని, అంత‌కంటే త‌క్కువ‌కు సినిమా చేయ‌కూడ‌ద‌ని డిసైడ్ అయిన‌ట్టు టాక్‌. సమంత ప్ర‌స్తుతం “యశోద”, “శాకుంతలం” లాంటి ప్ర‌తిష్టాత్మ‌క సినిమాలు చేస్తున్నారు. ‘అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’తో హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి సిద్ధమైంది. బాఫ్టా విజేత ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత లెస్బియ‌న్ పాత్రలో నటించనుంది.All Posts