Samantha Reaction: మనమంతా ఒక్కటే, కానీ వాటి వల్లే విడిపోయాం: సమంత ఎమోషనల్!

సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ కారణంగానే మేమిద్దరం విడాకులు తీసుకున్నామంటూ నాగచైతన్య చెప్పారు.

Published By: HashtagU Telugu Desk
Samantha

Samantha

టాలీవుడ్ మోస్ట్ కపుల్ నాగచైతన్య, సమంత (Samantha) విడిపోయిన చాలా రోజులు అవుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరు విడాకులు తీసుకొని దాదాపు ఏడాదిన్నర కావోస్తోంది. నేటికీ ఏదో ఒక అంశంలో సమంతనో, నాగచైతన్యనో సోషల్ మీడియా (Social media) లో హైలైట్ అవుతూనే ఉన్నారు. తాజాగా కస్టడీ సినిమా( Custody Movie) ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా కేవలం సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ కారణంగానే మేమిద్దరం విడాకులు తీసుకున్నామంటూ నాగచైతన్య చెప్పారు.

సమంత చాలా మంచి అమ్మాయి ఇప్పటికీ తన జ్ఞాపకాలను గౌరవిస్తాను. సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ కారణంగానే మా ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని అందుకే విడిపోయామని విడాకుల గురించి క్లారిటీ ఇచ్చారు. నాగచైతన్య విడాకులకు గల కారణాలను తెలియజేయడంతో ఒక్కసారిగా ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా నాగచైతన్య (Naga Chaitanya) చేసిన ఈ పోస్ట్ వైరల్ కావడంతో తాజాగా సమంత తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా మరొక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.

మనమంతా ఒక్కటే కేవలం అహంకారం, భయం అవే మనల్ని దూరం చేస్తాయి అంటూ సమంత ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేశారు. అయితే ఈ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చైతన్య వ్యాఖ్యల (Comments)పై సమంత ఇలా స్పందిస్తూ కామెంట్స్ చేశారని భావిస్తున్నారు.అలాగే వీరి మధ్య ప్రేమ ఉన్నప్పటికీ కేవలం ఈగో కారణంగానే విడిపోయారని వీరిద్దరు చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం సమంత షేర్ చేసిన పోస్ట్ వైరల్ (Viral) అవుతుంది. అయితే నాగచైతన్య తన మాజీ భార్య సమంత గురించి మాట్లాడిన మరుసటి రోజే సమంత రియాక్ట్ కావడం ఆసక్తిని రేపుతోంది.

Also Read: Spider Woman: స్పైడర్ ఉమెన్.. ఈమెకు సాధ్యంకానిదంటూ ఏదీ ఉండదేమో!

  Last Updated: 06 May 2023, 03:21 PM IST